ఆ సమయంలో ఎన్టీఆర్ ను దారుణంగా అవమానించిన కృష్ణ.. ఏమైందంటే?

సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ పలు ప్రయోగాత్మక సినిమాలలో నటించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కృష్ణ రాజకీయాల్లోకి రావాలని భావించలేదు. సీనియర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకోగా ఆ తర్వాత అదే స్థాయిలో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో ఎవరనే ప్రశ్నకు కృష్ణ పేరు సమాధానంగా వినిపిస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాజకీయాల్లోకి రావాలని కృష్ణకు ఎన్నోసార్లు ఆహ్వానం అందింది. అయితే ఆయన మాత్రం రాజకీయాల్లోకి రావడానికి అస్సలు ఆసక్తి చూపలేదు. 1984 సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల్లోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపున కృష్ణ ప్రచారం చేయగా 1984 ఎన్నికల సమయంలో కృష్ణగారు సీనియర్ ఎన్టీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ఈ ఎన్నికల్లో విమర్శలు చేసే సమయానికే సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు ఉండటం గమనార్హం. ఒకానొక సందర్భంలో కొంతమంది రాళ్లతో దాడి చేయడంతో కృష్ణ ఎన్టీఆర్ పైన , ఈనాడు దినపత్రిక పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం గమనార్హం. ఆ ప్రెస్ మీట్ లో కృష్ణ చేసిన వ్యాఖ్యల వల్ల ఈనాడు రిపోర్టర్లు, కృష్ణ మధ్య విభేదాలు తలెత్తాయి. రామోజీరావు కృష్ణగారి సినిమాలపై పరోక్షంగా బ్యాన్ విధించారు.

అయితే చాలా సంవత్సరాల తర్వాత వీళ్లిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయాయి. అయితే సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు మాత్రం చాలా సంవత్సరాల పాటు కొనసాగాయి. సీనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ పలు సినిమాలను తెరకెక్కించారు. ఎన్టీఆర్, కృష్ణ పోటాపోటీగా సినిమాలను విడుదల చేయడంతో పాటు ఎన్టీఆర్, కృష్ణ అభిమానులు కూడా విమర్శలు చేసుకోవడం గమనార్హం.