బాలయ్య సమరసింహారెడ్డి సినిమాలోని ఆ సీన్ కాపీనా.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగులో ఫ్యాక్షన్ సినిమాల హవా మొదలుకావడానికి సమరసింహారెడ్డి కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ సినిమాకు ముందే తెలుగులో పలు ఫ్యాక్షన్ సినిమాలు వచ్చినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కు సైతం ఎంతగానో నచ్చింది. మాస్ హీరోగా గుర్తింపు ఉండటంతో బాలయ్యకు ఈ సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించడం గమనార్హం. మాటల రచయిత రత్నం సూచనల మేరకు రాయలసీమ బ్యాక్ డ్రాప్ ను తీసుకొని ఈ సినిమాను సిద్ధం చేశారు.

రత్నం గారు నిజ జీవితంలో జరిగిన సీన్ ను స్పూర్తిగా తీసుకుని రైల్వేస్టేషన్ లో ఇరు వర్గాల వారు ఎదురెదురు పడిన సన్నివేశంను స్క్రిప్ట్ లో జోడించారు. విజయవాడలో జరిగిన ఘటన ఆధారంగా ఈ సీన్ తెరకెక్కింది. కథ విన్న బాలకృష్ణ కొంత సమయం కావాలని అడిగారు. ఈ సినిమాలోని పాటలు సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలోని అందాల ఆటబొమ్మ పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

రాయలసీమలో ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 8 కేంద్రాలలో ఈ సినిమా 175 రోజుల పాటు ఈ సినిమా ప్రదర్శించబడటం గమనార్హం. ఈ సినిమా ఫలితం బాలయ్యను మరో రేంజ్ లో నిలబెట్టింది. రాశి ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో సిమ్రాన్ కు ఈ సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది.