మెగాస్టార్ చిరంజీవి నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఫ్యాన్స్ నుంచి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉండటంతో అలాంటి స్క్రిప్ట్ ను సిద్ధం చేయడానికి స్టార్ డైరెక్టర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే బాలయ్య హీరోగా నటించిన ఒక సినిమాకు చిరంజీవి ప్రమోషన్స్ నిర్వహించారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ విధంగా నిజంగా జరిగింది.
బాలయ్య సినీ కెరీర్ లోని స్పెషల్ మూవీస్ లో ఆదిత్య 369 సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈతరం ప్రేక్షకులకు కూడా బాగా నచ్చే సినిమాలలో ఆదిత్య369 ఒకటి. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి ప్రస్తావిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.
ఈ సినిమాలో శ్రీ కృష్ణాదేవరాయలు పాత్రలో బాలకృష్ణను, మెయిన్ హీరోగా కమల్ హాసన్ ను తీసుకోవాలని సింగీతం శ్రీనివాసరావు భావించారు. అయితే కమల్ ఈ సినిమాకు డేట్లు కేటాయించే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అందువల్ల సింగీతం శ్రీనివాసరావు రెండు పాత్రలకు బాలయ్యను ఎంపిక చేయగా బాలయ్య తన నటనతో రెండు పాత్రలలో నటించి మెప్పించారు.
హీరోయిన్ గా వేర్వేరు పేర్లను పరిశీలించి మోహినిని ఈ సినిమాకు ఫైనల్ చేశారు. అప్పట్లో టాప్ రేంజ్ లో ఉన్న నటీనటులను, టెక్నీషియన్లను ఈ సినిమా కోసం తీసుకున్నారు. వెరైటీగా ఉంటుందని ఆదిత్య369 టైటిల్ ను ఫిక్స్ చేశారు. దాదాపుగా 4 నెలల పాటు ఈ సినిమా షూట్ జరిగింది. హాలీవుడ్ చిత్రాలను ఈ సినిమా మరిపించిందని అప్పట్లో కామెంట్లు వ్యక్తమయ్యాయి. తరుణ్ ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఈ సినిమా గురించి గొప్పగా చెబుతూ ఒక ట్రైలర్ లో చిరంజీవి నటించారు. బాలకృష్ణ తన క్రేజ్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశారు.