బన్నీ ఫ్యాన్స్ మెచ్చిన ఆర్య2 బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడానికి అసలు కారణాలివే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ఆర్య సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఆర్య2 సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అస్సలు అందుకోలేదు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 2009 సంవత్సరం నవంబర్ 25వ తేదీన విడుదలైంది.

ఈ సినిమాలో బన్నీ ఎంతో స్టైలిష్ గా నటించారు. అయితే కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ఒకింత మైనస్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చినా మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు. మగధీర తర్వాత కాజల్ నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని పాటలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి.

సుకుమార్ మార్క్ కథ, కథనాలతో ఈ సినిమా తెరకెక్కగా హీరో పాత్ర విషయంలో దర్శకుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే కొంతమంది అభిమానులకు మాత్రం ఈ సినిమా తెగ నచ్చేసింది. నిర్మాతలు రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

తెలుగులో ఫెయిల్యూర్ అయిన ఈ సినిమా మలయాళంలో ఈ సినిమా హిట్ అయింది. ఆర్యతో ఈ సినిమాను పోల్చి చూడటం, ఆర్య2లో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేకపోవడం, హీరో పాత్ర మరీ వెరైటీగా ఉండటం, రాంగ్ టైమ్ లో రిలీజ్ చేయడం వల్ల కూడా ఈ సినిమా సక్సెస్ కాలేదు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసి ఉంటే ఈ సినిమా మరింత బెటర్ రిజల్ట్ ను అందుకుని ఉండేది.