ఇదొక్కటీ నా మాట విను అంటూ జగన్ దగ్గర కుండబద్దలు కొట్టేసిన పీకే ?

పీకే .. అలియాస్ ప్రశాంత్ కిశోర్‌. ఎన్నికల వ్యూహాల్లో మంచి దిట్ట. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పరోక్ష కారణం కూడా ఈయనే. దాదాపు 18 నెల‌ల త‌ర్వాత‌, అంటే గ‌త 2019 ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్పడిన అనంత‌రం ప్రశాంత్ కిశోర్‌ బృందం ఏపీ నుంచి మ‌కాం మార్చేసింది. అయితే ఇన్ని రోజులు త‌ర్వాత‌ స‌రైన కార‌ణం లేకుండానే ప్రశాంత్ కిశోర్ ఏపీకి రావ‌డం , సీఎం జ‌గ‌న్‌తో భేటీ కావ‌డం స‌ర్వత్రా ఆస‌క్తి క‌లిగించింది.

PK back in AP to make Jagan CM again in 2024!

బెంగాల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్రశాంత్ కిశోర్‌ అక్కడ బిజీగా ఉన్నారు. పీకే దేశ‌వ్యాప్తంగా బీజేపీని గ‌ట్టిగా టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ఇక ఏపీలో వివిధ ప‌థ‌కాల అమ‌లు , ఆర్థిక స‌మ‌స్యలు, మ‌రోవైపు.. ఆల‌యాల‌పై దాడుల నేప‌థ్యంలో విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శలకు స‌మాధానం చెప్పలేక జ‌గ‌న్ కూడా అంత‌క‌న్నా బిజీగా ఉన్నారు. ఇటువంటి బిజీ సమయంలో ప్రశాంత్ కిశోర్‌- సీఎంజ‌గ‌న్ హ‌ఠాత్తుగా భేటీ కావడంతో ఏం జ‌రిగి ఉంటుంద‌నే ప్రచారం జోరుగా సాగు తోంది.

దీనిపై రకరకల వాదనలు వినిపించినప్పటికీ .. కీల‌క‌మైన సీఎం ప‌ద‌వి విష‌యంలో తన‌పై ఉన్న కేసులు విచార‌ణ ద‌శ‌లో ఉన్నందున అవి కొలిక్కి వ‌చ్చి.. తాను కేంద్ర ప్రభుత్వానికి టార్గెట్‌గా మారితే ఏం చేయాల‌నే విష‌యంపై చ‌ర్చించిన‌ట్టు సీనియ‌ర్లు చెబుతుండ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ఇక‌, ప్రస్తుతం వార్డు వాలంటీర్ వ్యవ‌స్థ మాదిరిగానే త్వర‌లోనే `సోష‌ల్ ఫ్రెండ్‌` పేరుతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా.. ప్రభుత్వ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల‌కు చేరువ చేయ‌డంతోపాటు.. ప్రభుత్వానికి, ప్రజ‌ల‌కు మ‌ధ్య డిజిట‌ల్ వార‌ధిని ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు. అదేవిధంగా మంత్రి వ‌ర్గ మార్పు, కూర్పుపై కూడా ఈ ద‌ఫా పీకేతో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.