జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానించే వీరాభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. మాస్ సినిమాలలో ఎక్కువగా నటించడం ద్వారా మాస్ ప్రేక్షకుల హృదయాలను ఎన్టీఆర్ గెలుచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో వరుసగా మాస్ సినిమాలలో నటించిన తారక్ కు ఆది, సింహాద్రి సినిమాలతో విజయాలు దక్కినా ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ కు వరుస ఫ్లాపులు తగిలాయి. ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ముగిసిపోయిందని కామెంట్లు వినిపించాయి.
అదే సమయంలో భారీగా బరువు పెరగడం ఎన్టీఆర్ కెరీర్ పై ప్రభావం చూపింది. అశోక్, రాఖీ సినిమాలలో ఎన్టీఆర్ లుక్స్ విషయంలో ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఇదే విషయాన్ని రాజమౌళి సైతం జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. బరువు మరింత పెరిగితే కెరీర్ విషయంలో మరింత నష్టపోవడం గ్యారంటీ అని రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కు సూచనలు చేశారు. రాజమౌళి సూచనలను పాటించిన తారక్ ఏకంగా 30 కిలోల బరువు తగ్గారు.
లైపోసక్షన్ చికిత్స ద్వారా తారక్ ఏకంగా 30 కేజీల బరువు తగ్గడం ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే ఎన్టీఆర్ బరువు తగ్గిన తర్వాత టీడీపీ కోసం ప్రచారం చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. ఎన్టీఆర్ కు బ్లడ్ రిలేషన్ లేని అన్నలు అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీవీ వినాయక్ కావడం గమనార్హం. ఈ ముగ్గురు అన్నలు ఎన్టీఆర్ కు అదుర్స్ తో బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని అనుకున్నారు.
అయితే అదుర్స్ సినిమా షూటింగ్ కొంతభాగం పూర్తైన ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ జరిగింది. అయితే అభిమానుల దీవెనలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తక్కువ సమయంలోనే యాక్సిడెంట్ నుంచి కోలుకున్నారు. డాక్టర్లు డ్యాన్స్ కు దూరం కావాలని తారక్ కు సూచించినా తారక్ మాత్రం డ్యాన్స్ కు దూరం కాలేదు. ఆ తర్వాత వరుసగా విజయాలను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.