వల్లభనేని వంశీ టీడీపీలో బలమైన యువ నేతగా మంచి పేరు ఉండేది, పెద్దగా రాజకీయ ప్రసంగాలు చేయకపోయినా కానీ ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది, అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైసీపీకి మద్దతు తెలుపుతూ టీడీపీకి దూరంగా ఉంటున్నాడు, వైసీపీలో అధికారంగా చేరలేదు తప్పితే, పూర్తి స్థాయి వైసీపీ నేతగా కొనసాగుతున్నాడు, అయితే వంశీ వైసీపీలోకి రావటం దుట్టా రామచంద్ర రావు, యార్లగడ్డ వెంకటరావు లకు సుతారం ఇష్టం లేదు.
వంశీ టీడీపీలో వున్నప్పుడు అతనితో వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికి తెలుసు, పైగా వంశీ వైసీపీలో ఉంటే తమకి రాజకీయ భవిష్యత్తు ఉండదని కూడా వాళ్ళకి తెలుసు అందుకే వంశీ రాకను గట్టిగా వ్యతిరేకించారు, అయితే వైసీపీ అధినేత జగన్ వాళ్ళ మాటను పట్టించుకోకుండా వంశీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనితో గన్నవరంలో రసవత్తమైన పోరుకు తెరలేచింది. ఎలాగైనా సరే నియోజకవర్గంలో తన పట్టు చూపెట్టాలని ఒకపక్క దుట్టా రామచంద్ర రావు, మరో పక్క యార్లగడ్డ వెంటకరావు ఇద్దరు తమ క్యాడర్ తో కలిసి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు, వీటికి వల్లభనేని వంశీ అడ్డు పడుతూ వస్తున్నాడు, ఎమ్మెల్యే కాబట్టి వంశీకి అడ్వాంటేజీస్ ఎక్కువగానే వున్నాయి, తాజాగా యార్లగడ్డ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన పుట్టిన రోజు వేడుకులు చేయాలనీ నిర్ణహించారు, అయితే ముందుగానే పసిగట్టిన పోలీసులు జన సమీకరణాలు చేసి వేడుకలు చేస్తే కేసులు పెడుతామని హెచ్చరించటంతో యార్లగడ్డ వర్గానికి ఏమి చేయాలో అర్ధం కాలేదు.
తమ పార్టీ అధికారంలో ఉన్నకాని, తమ నేత పుట్టినరోజు వేడుకలు కూడా చేసుకోలేని పరిస్థితి అక్కడ నెలకొని వుంది. అంతేకాకుండా ఏమైనా ప్రభుత్వ కార్యక్రమం కలిసి ఉమ్మడిగా చేయాల్సి వస్తే, కచ్చితంగా రసాభాస అవుతుంది. యార్లగడ్డ వర్గం, వంశీ వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరోపక్క గన్నవరం టీడీపీ ఇంఛార్జిగా బచ్చల అర్జునుడుని నియమించాడు. ఆయన గన్నవరంలో టీడీపీ శ్రేణులను కలుపుకొని పోతూ వంశీ కి క్యాడర్ లేకుండా చేయాలనీ చూస్తున్నాడు. అయితే వంశీ ఏమి తక్కువ తినలేదు, తన పదవి అడ్డం పెట్టుకొని మిగిలిన నేతలకు ఎంత చికాకు తెప్పించాలో అంతకంటే ఎక్కువగానే తెప్పిస్తూ తన హవా తగ్గకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి మున్ముందు గన్నవరం రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి.