టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు… ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి… మహా మీడియా యుద్ధం …!

ఒక వ్యక్తి గాని సంస్థ గాని తమకు తెలిసిన సమాచారానికి తమ నాలెడ్జ్, ఇంటలిజెన్స్ ను ఉపయోగించి వేరే వాళ్లకు సమాచారాన్ని ఇవ్వడమే మీడియా. మీడియా యొక్క ప్రైమ్ డ్యూటీ సమాచారాన్ని ఇవ్వడమే. కానీ ఈ రోజుల్లో మీడియా సమాచారాన్ని మ్యానిపులెట్ చేస్తూ ప్రజలను ఎమోషణలైజ్ చేస్తున్నారు.

దాదాపు ప్రతి మీడియా సంస్థ ఎదో ఒక రాజకీయ పార్టీకి చెందినవే, లేక సపోర్ట్ చేసేవే. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు పెద్ద న్యూస్ చానల్స్ మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆ ఛానెల్స్ ఏవంటే ఒకటి టీవీ5, ఇంకొకటి ఎన్టీవీ. ఈరెండు చానల్స్ పేర్లు వినగానే గొడవ ఎందుకు జరిగిందో మీకు అర్ధమవుతుంది. రెండింటిలో టీవీ5 టీడీపీకి మద్దతు తెలుపుతుండగా, ఎన్టీవీ వైసీపీకి మద్దతు తెలుపుతున్న విషయాలు అందరికి తెలిసినవే. అయితే ప్రస్తుతం ఈ రెండు చానల్స్ ఒకరిపై ఒకరు తమ చానల్స్ లలో కథనాలు, ప్రోమోస్ విడుదల చేస్తున్నారు. టీవీ5 చైర్మన్ బీఅర్ నాయుడు, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి ఇద్దరు కూడా ఒకరినిఒకరు కథనాలతో, ప్రోమోస్ తో బ్లాక్ మెయిల్ చేసుకుంటున్నారని సమాచారం. టీవీ5 జూబ్లీహిల్స్ సొసైటీ అని నరేంద్ర చౌదరిపై కథనాలు ప్రసారం చేస్తుంటే, ఎన్టీవీ అర చేతిలో వెంట్రుకలు మొలిపించే ఆయిల్ అని బీఅర్ నాయుడుపై కథనాలు ప్రసారం చేస్తుంది. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న టీవీ5ను అడ్డుకోవడానికే వైసీపీ నాయకులూ ఎన్టీవీని వాడుకుంటున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నారు.

ఈ రెండు చానల్స్ యొక్క యజమానులు రానున్న రోజుల్లో ఒకరి పరువు ఒకరు తీసుకుంటారో లేక ఒక ఒప్పందానికి వచ్చి కథనాలను ఆపుకుంటారో చూడాలి. వీళ్లిద్దరి మధ్య గొడవలకు రాజకీయ కారణాలు కాకుండ వేరే ఏవైన కారణాలు ఉన్నాయా అనే అంశాలపై మీడియా వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మీడియా అనేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిలా ఉండాలే గాని ఇలా రాజకీయాల నాయకుల చేతిలో కీలు బొమ్మల్లా ఉంటూ వాళ్ళ కోసం కొట్టుకుంటూ జనాల మీద ఇలా అనవసరపు కథానాలను ప్రచారం చేయకూడదని విశ్లేషకులు చెప్తున్నారు. రాజకీయ పార్టీల కోసం మొదలైన ఈ చానల్స్ యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.