Balayya 107 : ఇన్సైడ్ టాక్ – బాలయ్య సినిమాకి పవర్ఫుల్ టైటిల్ ?

Balayya 107 : నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన రీసెంట్ భారీ హిట్ సినిమా “అఖండ” తర్వాత మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఇంకో మాసివ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అనౌన్సమెంట్ నుంచే భారీ స్థాయి అంచనాలు నెలకొనగా..
ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మొదటి నుంచి కూడా పలు ఇంట్రెస్టింగ్ వార్తలే బయటకి వచ్చాయి. ఒకపక్క పర భాషల నుంచి పలువురు స్టార్ నటుల్ని కీలక పాత్రలోకి తీసుకురాగా ఈ మాస్ ప్రాజెక్ట్ కి ఏ టైటిల్ కన్ఫర్మ్ అయ్యింది అనే ప్రశ్న కూడా నందమూరి అభిమానుల్లో చాలా ఆసక్తిని రేపింది.
అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక పవర్ఫుల్ మరియు మాస్ టైటిల్ ని సెట్ చేసినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకి గాను “అన్నగారు” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్టుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అంతర్గత టాక్. ప్రస్తుతానికి అయితే ఈ టైటిల్ పరంగా అభిమానులు పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.
మేకర్స్ ఈ టైటిల్ నే ఫిక్స్ చేసారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అలాగే మైత్రి పతాకంపై ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుంది.