ఇన్సైడ్ టాక్ : నాగ్ సినిమాకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మెహ్రీన్?

టాలీవుడ్ కింగ్ హీరోగా ఇప్పుడు పలు ఆసక్తికర సినిమాలు చేస్తూ వస్తున్నారు. మరి ఇదిలా ఉండగా వాటిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా “డెవిల్” కూడా ఒకటి. దర్శకుడు ప్రవీణ్ సత్తారు చేస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మొదట నాగ్ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ ని ఫిక్స్ చెయ్యగా తర్వాత ఆమె పలు కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకుంది.

కానీ మళ్ళీ ఆమె ప్లేస్ లో ఇంకో హీరోయిన్ ని అనుకుంటే ఆమె కూడా భారీ రెమ్యునరేషన్ ఫిగర్ చెప్పి షాక్ ఇచ్చిందట. మళ్ళీ చిత్ర బృందం యంగ్ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ని సంప్రదించగా ఈమే అంతకు మించి షాక్ ఇచ్చిందని ఇన్సైడ్ టాక్. మెహ్రీన్ ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అడిగిందట. దీనితో చిత్ర నిర్మాతలకు నోట మాట రాలేదని తెలుస్తుంది. దీనితో ఇప్పుడు ఈ అంశమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.