ఇన్సైడ్ టాక్ : పవన్ ఫ్యాన్ కి బాలయ్య డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడా.?

ఇప్పుడు టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోల్లో ఒకరైన నందమూరి నటసింహ బాలకృష్ణ మళ్ళీ తన కెరీర్ లో మంచి పీక్ లో ఉన్నారని చెప్పొచ్చు, తన లాస్ట్ సినిమా “అఖండ” తో తాను భారీ హిట్ అందుకోగా నెక్స్ట్ రెండు సినిమాలు కూడా బాలయ్య వేరే లెవెల్ లైనప్ ని సెట్ చేసుకున్నారు.

ఇక నెక్స్ట్ ఇప్పుడు వీరసింహా రెడ్డి అలాగే దర్శకుడు అనీల్ రావిపూడి తో తన కెరీర్ 108వ సినిమాని తెరకెక్కించనుండగా నెక్స్ట్ సినిమాగా అయితే బాలయ్య ఇంకో క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా మరెవరో కూడా కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండ్ టాలీవుడ్ స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ తో అట.

మరి ఈ సినిమాని కూడా ఇప్పుడు తీస్తున్న చిత్రం వీరసింహా రెడ్డి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది పక్కా సమాచారం కాగా ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారిక అప్డేట్ బయటకి ఇంకా రావాల్సి ఉంది.

ఇక ఇదే బ్యానర్ లో అయితే ప్రస్తుతం హరీష్ శంకర్ కూడ పవన్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మరి అదెప్పుడు మొదలువుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.