ఒక బాహుబలి 2 ఒక కేజీఎఫ్ 2 సినిమాలు తర్వాత మళ్ళీ పాన్ ఇండియా మార్కెట్ లో భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని ఉన్న మరో చిత్రం “పుష్ప 2”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే దర్శకుడు సుకుమార్ నుంచి వచ్చిన మూడో సినిమా పుష్ప కాగా దీనికి భారీ వసూళ్లు వచ్చి పెద్ద హిట్ అయ్యింది.
దీనితో దీని సీక్వెల్ పుష్ప 2 పై అయితే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. మరి నిన్ననే ఈ సినిమాపై ఫైనల్ గా ఓ అప్డేట్ కూడా చిత్ర యూనిట్ అందించింది. అయితే ఇప్పుడు దీని తర్వాత ఇండస్ట్రీ వర్గాల నుంచి మరో టాక్ బయటకి వచ్చింది.
గతంలో ప్లాన్ చేసినట్టుగానే ఈ సినిమా నుంచి కూడా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసినట్టుగా ఈసారి పార్ట్ 2 కి కూడా రిలీజ్ చేయనున్నారని గట్టి టాక్ మొదలైంది. అయితే దీనిని కొట్టి పారేయడానికి లేదని చెప్పాలి. ఆల్రెడీ ఫోటో షూట్ అయితే జరిగింది.
దీనితో కొన్ని రోజుల్లో ఈ ఫస్ట్ లుక్ తో మాసివ్ ట్రీట్ రావడం ఖాయం అని చెప్పాలి. మరి దీనిపై అయితే మరింత సమాచారం ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇంకా ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ వారు మరింత గ్రాండ్ లెవెల్లో సినిమాని ప్లాన్ చేస్తున్నారు.