ఇండస్ట్రీ టాక్ : “ఆదిపురుష్” రిలీజ్ పై షాకింగ్ గాసిప్స్.!

వచ్చే ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి రెడీగా ఉన్న ఎన్నో చిత్రాల్లో మరి మొదటి నెలలోనే ఎలా లేదన్నా 1000 కోట్లు కొల్లగొట్టే సినిమాగా నిలిచిన భారీ పాన్ ఇండియా చిత్రం “ఆదిపురుష్” కూడా ఉంది. దర్శకుడు ఓంరౌత్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ఈ భారీ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కింది.

మరి ఇది అంతా బాగానే ఉంది పైగా రిలీజ్ డేట్ ఎప్పుడో బీసీ కాలంలో మేకర్స్ ఫిక్స్ చేశారు. అలాగే నిన్న కూడా ప్రభాస్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్స్ తో కూడా డేట్ ని అలాగే ఉంచారు. కానీ సినీ వర్గాల్లో అయితే సినిమా అనుకున్న డేట్ కి డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.

ఎలా లేదన్నా రెండు లేదా మూడు వారాలు డెఫినెట్ గా వాయిదా ఉంటుంది అని కొన్ని ట్రస్టడ్ సోర్స్ లు చెబుతున్నాయి. మరి దీనికి అయితే కారణం చాలా పెండింగ్ ఉన్న గ్రాఫిక్ వర్క్స్ మూలానే అన్నట్టు తెలుస్తుంది. ఇది ఎంత వరకు నిజం అవుతుంది అనేది వేచి చూడాలి.

అధికారిక ప్రకటన ఏమన్నా వస్తుందా లేక అనుకున్న డేట్ కే సినిమా వస్తుందా అనేది అప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రంలో అయితే సైఫ్, కృతి సనన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహన్ తదితరులు నటించగా మేకర్స్ 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాం అని చెప్తున్నారు.