ఇండస్ట్రీ టాక్ : మరోసారి చిరుతో రవితేజ? ఏ సినిమాలో అంటే.!

Industry Talk On Raviteja Act In Chiru Film | Telugu Rajyam

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజ రవితేజ లు కలిసి నటించిన అన్నయ్య సినిమా కోసం కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమాలో ఎలా అయితే అన్న తమ్ముళ్లులా కనిపించి మెప్పించారో బయట కూడా మెగాస్టార్ ని రవితేజ అన్నయ్య అనే పిలుస్తూ తనకి గురు లా భావిస్తాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకు ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాల్లో దర్శకుడు బాబీ చేస్తున్న మెగా మాస్ ప్రాజెక్ట్ లో రవితేజ చిన్న పాత్రలో కనిపించనున్నాడట. మరి అది గెస్ట్ రోల్ లోనా లేక మంచి కామియో రోల్ లోనా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు అలానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మాణం చేస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles