ఇండస్ట్రీ టాక్ : కొరటాల కథలో వేలు పెడుతున్న ఎన్టీఆర్?? అసలు మేటర్ ఇదేనట.!

రీసెంట్ గా అనౌన్స్మెంట్ తోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలు ఏ రేంజ్ లో హైప్ వచ్చిందో చూసాం. అయితే వాటిలో దర్శకుడు కొరటాల శివతో చేసే 30వ సినిమా పై రిలీజ్ చేసిన క్రేజీ మోషన్ పోస్టర్ టీజర్ తో ఒక్కసారిగా అంచనాలు వేడెక్కాయి. ఆచార్య తో కొరటాల పై పోయిన నమ్మకం అంతా జస్ట్ ఈ వీడియో తో ఎన్టీఆర్ తెచ్చేసాడు. ఇక పాన్ ఇండియా లెవెల్లో ఒక్కసారిగా భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇంట్రెస్టింగ్ సమాచారం వినిపిస్తోంది.

ఈ సినిమా కథ కొరటాల శివనే రాసుకున్నా ఇప్పుడు ఎన్టీఆర్ కూడా కొరటాల కథలో వేలు పెడుతున్నాడట. ఎట్టి పరిస్థితుల్లో కథ పర్ఫెక్ట్ గా ఉండాలని స్టోరీ సిట్టింగ్స్ లో కొరటాల శివతో తాను కూడా కూర్చుంటున్నాడట. దీనితో తన ప్రమేయం కూడా కథలో ఉంటుంది అని చిన్న చిన్న మార్పులు ఎన్టీఆర్ కొరటాల కి సజెస్ట్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న సమాచారం.

మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాని యసుధ ఆర్ట్స్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ బ్యానర్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పై భారీ స్థాయి బడ్జెట్ లో ప్లాన్ చేస్తుండగా అనిరుద్ మాసివ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఇంకా ఈ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ అవ్వాల్సింది.