ఇప్పుడు సినీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ గా ప్రముఖ ఇండియన్ క్రికెటర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరు నిలిచింది. తాను క్రికెట్ లో బ్రేక్ తీసుకున్నాక సినిమాల్లో ధోని ఎంట్రీ ఇచ్చాడు. మరి తాను నటించకుండా నిర్మాతగా అయితే “ధోని ఎంటర్టైన్మెంట్” పేరిట నిర్మాతగా మారి సినిమాలు చేయనున్నట్టు ధోని తెలిపాడు.
ఇక నిన్ననే ఈ సినిమా సంస్థ నుంచి మొదటి సినిమా తమిళ్ నుంచి ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. మరి ఈ మొదటి సినిమా ఏ హీరోతో ఏ దర్శకునితో అనేది సినీ వర్గాల్లో తెలుస్తుంది. ఈ చిత్రం మొదటగా యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ తో అయితే అయితే ధోని తీయబోతున్నాడట.
మరి ఈ యంగ్ హీరో అయితే జెర్సీ సినిమాలో కనిపించిన యువ నటుడు కాగా తనతో తమిళ్ లో ధోని మొదటి సినిమా తీయనున్నాడట. ఇక దర్శకుడు అయితే రమేష్ తమిళ మణి అన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి సినీ వర్గాల్లో ఈ కాంబినేషన్ లో మొదటి సినిమా అంటూ ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి.
మరి మొదటి నుంచే రిస్క్ చేయకుండా చిన్న హీరోలతో స్టార్ట్ చేసి ధోని నిర్మాతగా మంచి ఆలోచన చేస్తున్నాడని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో అయితే ఎలాంటి సినిమాలు చేయనున్నాడో చూడాలి.