వైరల్ అప్డేట్ : ధోని ప్రొడక్షన్ లో ఫస్ట్ సినిమా ఏ భాషలో అంటే..!

సినిమాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని అంటే తెలియని భారతీయులు ఎక్కడా ఉండరు. అలాంటి రేంజ్ మార్క్ సెట్ చేస్కోడం కొంత మందికే సాధ్యం అవుతుంది. ఇక ఇదిలా ఉండగా మహేంద్ర సింగ్ ధోని కి క్రికెట్ పరంగా భారీ క్రేజ్ ఉంది.

దానితో తనని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఎప్పుడు నుంచో అభిమానులు కోరుకుంటున్నా ధోని మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ధోని అయితే సినిమాల్లో మరో రకంగా ఎంట్రీ ఇచ్చాడు. ఓ నిర్మాత గా అయితే ధోని తన నిర్మాణ సంస్థ ధోని ఎంటర్టైన్మెంట్ తో ముందుకొచ్చాడు.

గత కొన్నాళ్ళ కితమే ధోని ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడు అధికారికంగా తన మొదటి సినిమా పై అప్డేట్ ఇచ్చాడు. తన ఫిల్మ్ ప్రొడక్షన్ లో మొదటి సినిమా అయితే తమిళ భాషలోనే స్టార్ట్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసాడు. మరి దానిపై అయితే అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి దీనిని ఖరారు చెయ్యగా ధోని ఫస్ట్ సినిమా అయితే కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ప్రస్తుతం అయితే ధోని తమిళ్లో దళపతి విజయ్ తో సినిమా చేస్తాడని రూమర్స్ ఉన్నాయి. ఇక ఇతర భాషల్లో కూడా తను తీయనున్నట్టు తమిళ సినీ వర్గాలు చెప్పాయి. అయితే ధోని హిందీ భాష వాడు అయినా కూడా మొదట బాలీవుడ్ లో కాదని సౌత్ నుంచే స్టార్ట్ చెయ్యడం విశేషం. బహుశా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి వచ్చిన ప్రేమ వల్ల కావొచ్చు. ప్రస్తుతం అయితే సినీ వర్గాల్లో ధోని ఫస్ట్ సినిమా అనౌన్స్మెంట్ వైరల్ గా మారింది.