గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు క్రిష్ తో ప్లాన్ చేసిన ఈ చిత్రం పవన్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఇప్పటికే చాలా షూటింగ్ అయ్యింది కానీ సినిమా మాత్రం నత్త నడకలోనే నడుస్తుంది.
కొన్ని రోజులు కితం అయితే బాగా హంగామా చేశారు కానీ రెండు మూడు రోజులు మాత్రం షూటింగ్ చేసారు. కానీ మళ్ళీ సీన్ కట్ చేస్తే పవన్ రాజకీయాల్లో ఊహించని మలుపులు తీసుకోవడం నిర్మాతలకి దర్శకుడు కి తలనొప్పిగా మారింది.
దీనితో మళ్ళీ హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయినట్టే అని కొందరు అనుకుంటున్నారు కానీ వాస్తవానికి పవన్ అయితే సినిమా కంటిన్యూ చేసే ప్లాన్ లోనే ఉన్నారని అంతర్గత సమాచారం. ఇప్పుడు పాలిటిక్స్ హీట్ ఉన్నపటికీ పవన్ అయితే వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.
అయితే ఇది ఎప్పుడు ఈ మధ్యలోనే ఉంటుంది అంటున్నారు కానీ మరింత కన్ఫర్మేషన్ దీనిపై ఇంకా రావాల్సి ఉంది. మొత్తానికి అయితే పవన్ చర్యలతో మేకర్స్ తో పాటుగా ఫ్యాన్స్ కూడా టెన్షన్ గానే ఉంటున్నారు.