ఇండస్ట్రీ టాక్ : “ఆదిపురుష్” కొత్త రిలీజ్ డేట్ అదేనా.?

ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం డైరెక్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కగా దీనిపై అనేక అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆల్రెడీ రిలీజ్ డేట్ జనవరి 12 అని ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు. అయితే తర్వాత మాత్రం మళ్ళీ సినిమా రిలీజ్ డేట్ కి రావడం డౌట్ నే అని గట్టి టాక్ బయటకి వచ్చింది. దీనితో ఆల్ మోస్ట్ సినిమా వాయిదానే అనే మాట గట్టిగా వినిపించింది.

అయితే ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో బయటకొచ్చి వైరల్ గా మారింది. ఆదిపురుష్ కొత్త డేట్ అయితే వచ్చే ఏడాది మూడో నెల 30 కి ఫిక్స్ అయ్యినట్టుగా లేటెస్ట్ గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి దీనిలో ఎంతమేర నిజం ఉంది అనేది ఇంకా బయటకి రావాల్సి ఉంది.

ఇంకా ఈ సినిమాలో అయితే సీతాదేవిగా కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్, అలాగే సన్నీ సింగ్ సోనాల్ చౌహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే భూషణ్ కుమార్ మరియు ఓం రౌత్ లు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కింది అలాగే 3డి లో ఈ సినిమాని ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.