సుడిగాలి సుధీర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయినా ఇంద్రజ!

ప్రముఖ హీరోయిన్ ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించిన ఇంద్రజ చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కానీ ఇటీవల ఇంద్రజ ఒకవైపు సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తూ.. మరొక వైపు బుల్లితెర మీద జడ్జ్ గా కూడా సందడి చేస్తోంది. ప్రస్తుతం ఇంద్రజ బుల్లితెర మీద ప్రసారమౌతున్న పాపులర్ షోస్ లో ఒకటి అయిన జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరిస్తోంది. మంత్రి పదవి దక్కటంతో రోజా జబర్దస్త్ కి దూరమయ్యింది. అందువల్ల రోజా స్థానాన్ని ఇంద్రజ భర్తీ చేసింది. ఈ షో ద్వారా ఇంద్రజ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ సుధీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంలో సుధీర్ కి తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ లో కనిపించడం లేదు. కొంతకాలం శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో యాంకర్ గా పనిచేసిన సుధీర్.. ఇప్పుడు ఆ షో కి కూడా దూరంగా ఉంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజని సుధీర్ జబర్దస్త్ మానేయడానికి గల కారణం ఏంటి? అని అడగగా.. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడను . నా గురించి తప్పా ఇంకెవ్వరి గురించి కూడా నేను చెప్పను అంటూ సమాధానం చెప్పింది.

ఇక ఈ క్రమంలో సుధీర్ జబర్ధస్త్ నుండి వెళ్ళిపోవటం గురించి మీరెలా ఫీల్ అవుతున్నారు? అని ఇంద్రజని అడగ్గా. సుధీర్ జబర్ధస్త్ నుండి వెళ్ళిపోవటం నాకు చాలా భాదగా ఉంది. సుధీర్ తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. సుధీర్ ని నేను సిద్దు అని పిలుస్తా. సుధీర్ కూడా నన్ను రాజీ అని ప్రేమగా పిలుస్తాడు. ఇక శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో సుధీర్ నన్ను అమ్మా అని పిలుస్తాడు. తనతో అమ్మా అని పిలిపించుకోవటం నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. సుధీర్ జబర్ధస్త్ మానేసిన తరువాత కెవ్వు కార్తీక్ సుధీర్ గురించి ఓ స్కిట్ చేశాడు. ఆ స్కిట్ లో కార్తీక్ సుధీర్‌లా కళ్ల అద్దాలు పెట్టుకునేటప్పుడు నాకు సుధీర్‌ గుర్తొచ్చాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఏడ్చేశాను. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను అంటూ ఇంద్రజ చెప్పుకొచ్చింది.