నోరూ మంచిదైతే ఊరు మంచిదనే సామేత ఊరికే పుట్టలేదని కొన్ని సందర్భాలు నిరూపిస్తాయి.. అదీగాక అధికారం చేతిలో ఉందని ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకునే రోజులు కావు ఇప్పుడున్నవి.. ఈ విషయం ప్రస్తుతం ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే.. ఏపీలో రగుకులున్న మతపరమైన సంఘర్షణ గురించి అందరికి తెలిసిందే.. చిలికి చిలికి తుఫానులా మారిన ఈ విషయం చివరికి కేంద్రం వరకు వెళ్లింది.. వెళ్లింది అనే కంటే కేంద్ర పెద్దల చెవులకు వినబడేలా చేశారు అనడం మేలు.. ఈ విషయంలో ముఖ్య పాత్రధారిగా మంత్రి కొడాలి నాని చేరారు..
ఇకపోతే వైసీపీలో గానీ సీయం జగన్ దృష్టిలో గానీ, కొడాలి నానికి ఉన్న స్దానం గురించి తెలిసిందే.. పార్టీలోను, ప్రభుత్వంలోనూ నానికి, వైఎస్ జగన్ ఎంత ప్రాధాన్యం ఇస్తారో చాలా సార్లు నిరూపించబడింది. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాని, పార్టీలో కీలక ఐకాన్‌గా మారారు. వైఎస్ జగన్ కూడా ఆయనకు అన్ని విధాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అయితే కొడాలి నాని ఈ మధ్యకాలంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం గురించి చేసిన వ్యాఖ్యలు గానీ, తిరుమల డిక్లరేషన్ విషయంలో గానీ కాస్త దూకుడు ప్రదర్శించారు.. ఏకంగా ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ విషయాన్ని కూడా ప్రతిపాదించారు.. కేంద్రానికి చురక తగిలేలా మోడీ ఏ భార్యతో కలిసి వెళ్లి, అయోధ్య రామమందిరానికి శంకుస్థాపన చేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు..
అంతే జాతీయస్థాయిలో ఈ వ్యాఖ్యలు తీవ్ర మంట పుట్టించాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలు నాని వ్యవహారంపై సీరియస్ అయ్యారని సమాచారం.. ఈ మాటల వల్ల బీజేపీ ఒకరకంగా రాజకీయంగా మున్ముందు వైసీపీని మరింతగా టార్గెట్ చేసే అవకాశం కల్పించినట్లేనని పరిశీలకులు అంటున్నారు.. ఇప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలతో కేంద్రంతో, వైసీపీకి దూరం పెరిగితే ఏపీకి నష్టంతో పాటుగా, 2024 ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలంటే కేంద్రం నుంచి సాయం తప్పనిసరి కాబట్టి వైఎస్ జగన్‌కు కూడా నష్టం కలిగే అవకాశాలున్నాయట. ఇది గ్రహించిన సీయం జగన్ తన సలహాదారు సజ్జల ద్వారా పరోక్షంగా నానిని హెచ్చరించే ప్రయత్నం చేశారని, ఎన్ని వివాదాలు ఉన్నా మోడీని ఈ విషయంలోకి లాగడం తప్పేనని సజ్జల వ్యాఖ్యానించడాన్ని బట్టి కొడాలిపై జగన్ ఎన్నడూ లేనంత సీరియస్ గా ఉన్నారనే విషయం స్పష్టమవుతోందని అంటున్నారు పార్టీలోని కొందరు నేతలు.. లోగుట్టు పెరుమాళ్లకు ఏరుక అన్నట్లు ఈ విషయం ఎంత వరకు నిజమో వారికే తెలియాలి..