Indira canteen: అన్నా క్యాంటీన్ల తరహాలో ఇందిరా క్యాంటీన్లు!

Indira canteen: ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలోనూ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు పేరు మీద ఏర్పాటు చేసిన ఈ అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్ నుంచి మొదలుకొని మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా అందుబాటులో ఉంటుంది. అయితే అయిదు రూపాయలకు ఇక్కడ ప్లేట్ భోజనం లభించడం విశేషం.. ఇలా అన్న క్యాంటీన్ల ద్వారా ఎంతో మంది పేద ప్రజలు తక్కువ ధరకే కడుపునిండా అన్నం తినే సదుపాయాన్ని చంద్రబాబునాయుడు తీసుకువచ్చారు.

ఇలా అన్న క్యాంటీన్ల తరహాలోనే ఇకపై హైదరాబాదులో కూడా ఇందిరా క్యాంటీన్లు రాబోతున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న రూ. 5 అన్నపూర్ణ భోజనం కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మారుస్తూ GHMC స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ భోజన కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత తెలంగాణ విడిపోయి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పేరును మార్చకపోయినా ఈ అన్నపూర్ణ కేంద్రాలను విస్తరింప చేశారు.

ఇకపోతే ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ఇలా తిరిగి హైదరాబాదులో కాంగ్రెస్ వచ్చిన నేపథ్యంలో అన్నపూర్ణ కేంద్రాలను కాస్త ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చబోతున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం మధ్యాహ్నం మాత్రమే ఐదు రూపాయలకు భోజనం అందిస్తారు. ఉదయం కూడా బ్రేక్‌ఫాస్ట్ రూ. 5కే అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగేప్రస్తుతం ఉన్న అన్నపూర్ణ కేంద్రాలను శాశ్వత కట్టడాలుగా మార్చాలని నిర్ణయించారు. ఇలా ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం మాత్రమే కాకుండా ఉదయం కూడా టిఫిన్ ఏర్పాట్లు చేయటం గొప్ప విషయం అని చెప్పాలి.