Ukraine: ఉక్రెయిన్ లో చిక్కుకున్న మరొక భారత విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాల నుంచి బయట పడ్డాడు. ఢిల్లీకి చెందిన హర్ జ్యోత్ సింగ్ గత నెల 27 నుంచి అతనితో పాటు ఇద్దరు స్నేహితులతో కలిసి కీవ్ నుంచి టాక్సీ లో బయలుదేరాడు. ఈ క్రమంలోనే రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన కాల్పుల్లో నాలుగు తూటాలు అతడి శరీరంలో కి వెళ్ళాయి. దీంతో హుటాహుటిన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
అతడిని పరీక్షించిన వైద్యులు శరీరంలో బుల్లెట్లు ఉన్నట్టు గుర్తించారు. ఇక వెంటనే చికిత్స మొదలు పెట్టి అతని శరీరంలో ఉన్న నాలుగు బుల్లెట్ లను బయటకు తీసేసారు. అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది అని వైద్యులు ధ్రువీకరించారు. ఇది ఘటన జరిగినప్పుడు అతను కీవ్ లోని మన రాయబార కార్యాలయం సమీపంలో ఉన్నప్పటికీ అధికారులు ఎవరూ సరిగ్గా స్పందించలేదని హర్ జ్యోత్ ఆరోపించాడు. ఆక్షణంలో చావు తప్పదు అని అనుకున్నాను అని కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు అని తెలిపాడు. వెంటనే తనను భారత్ కు తరలించాలని కోరాడు.