బాలీవుడ్ లో బయటపడ్డ డ్రగ్స్ వ్యవహారం దేశంలో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో చాలామంది ప్రముఖులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖ హీరోయిన్స్ దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ లకు కూడా నోటీసులు అందించారు. సుశాంత్ మరణంను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఈ డ్రగ్స్ వ్యవహారంను బయటకు లాగారు.
అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం ఇండియన్ క్రికెటర్లను కూడా పట్టుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ డ్రగ్ వ్యహారాలపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. హీరోయిన్ షెర్లీన్ చోప్రా మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ పై సంచలన ఆరోపణలు చేసింది.
ఒకసారి తాను కేకేఆర్ మ్యాచ్ చూడటానికి కోల్కతా వెళ్లానని, ఆ మ్యాచ్ అయిపోయిన తరువాత అక్కడ కేకేఆర్ టీం వాళ్ళు చేసుకుంటున్న పార్టీ తాను కూడా వెళ్లానని, అయితే అక్కడ జరిగిన సంఘటనలు చూసి తాను ఆశ్చర్యపోయనని తెలిపారు. పార్టీ దగ్గర ఉన్న వాష్ రూమ్ లో ఇండియన్ క్రికెటర్ల యొక్క భార్యలు కూడా కొకైన్ తీసుకుంటూ ఉన్నారని తెలిపారు.
ఆ పార్టీ ఇంకా చాలా మంది డ్రగ్స్ తీసుకున్నారని, బాయ్స్ వాష్రూమ్ దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉండి ఉండవచ్చని వెల్లడించింది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇంకెంతమంది బయట పడతారో వేచి చూడాలి. నేషనల్ మీడియా రైతుల సమస్యలను కూడా పట్టించుకోకుండా ఈ డ్రగ్స్ చుట్టే తిరుగుటున్నాయి. అధికారులు వీలైన్నంత తొందరగా ఈ డ్రగ్స్ కుంభకోణాన్ని చేదిస్తామని వెల్లడించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్, రకూల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరు అయ్యే అవకాశం ఉంది.