IND vs SL | ముగిసిన తొలిరోజు ఆట.. ఆరు వికెట్లు కోల్పోయిన శ్రీలంక

బెంగళూరు వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. భారత బౌలర్ల దాటికి శ్రీలంక బ్యాటర్లు వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 86/6 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో నిరోషన్ డిక్కవెల్లా (12 నాటౌట్), లసింత్ ఎంబుల్డెనియా క్రీజులో ఉన్నారు.