Modi: పాక్ భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల అమెరికా జోక్యం చేసుకోవడంతో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకొని కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం అధికారులు ఆపరేషన్ సింధూర్ ఆగడం లేదని తెలుపుతున్నారు. భారత్ పై పాకిస్తాన్ చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ లేకుండా చేస్తామంటూ భారత ఆర్మీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇకపోతే అమెరికా చొరవతో పాకిస్తాన్ భారత్ ఒప్పందం కుదుర్చుకొని కాల్పులకు విరమణ ఇచ్చిన నేపథ్యంలో చాలామంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మోడీ తీరును తప్పు పడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ హర్ష కుమార్ సైతం మోడీ తీరుపై విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ స్పందిస్తూ…మోదీ భారత సార్వభౌమత్వాన్ని అమెరికా పాదల చెంత తాకట్టుపెట్టాడని. ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ తీరు ఏ మాత్రం బాగాలేదని తెలిపారు.
యుద్ధ విరమణను అమెరికా ప్రెసిడెంట్ ట్వీట్ ద్వారా ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. సిమ్లా ఒప్పందం ప్రకారం.. భారత్-పాక్ మధ్య సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించాలనీ, మూడవ దేశానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని తెలిపారు. నేడు ఆ నిబంధనను మోదీ ఉల్లంఘించారని ఆరోపించారు. భారతదేశాన్ని మోదీ అమెరికాకు తాకట్టు పెట్టారనీ మోడీకి ఆ అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.
కాల్పుల విరమణ తర్వాత ఏ భారతీయుడికి నిద్ర పట్టడం లేదని ప్రతి ఒక్క భారతీయుడిని కించపరిచే విధంగా మీ నిర్ణయం ఉందని తెలిపారు. పహల్గాం ధాడిలో మరణించినటువంటి వారికి మీరు ఇచ్చే నివాళులు ఇదేనా అంటూ మోడీని వరుస ప్రశ్నలు వేస్తూ మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.