Legend Movie: లెజెండ్ సినిమాలో పెద్ద వేషం అని పిలిచి ఒక్కటే డైలాగ్ ఇచ్చారు: సీనియర్ నటి అన్నపూర్ణ

Legend Movie లెజెండ్ సినిమాకు సంబంధించి తనకు పెద్ద వేషం పడుతుందనుకుని తనను పిలిచారని సీనియర్ నటి అన్నపూర్ణమ్మ అన్నారు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని మార్పుల వల్ల కావచ్చు పెద్ద క్యారెక్టర్‌ తనకు పడలేదని ఆమె చెప్పారు. కేవలం ఒక్క డైలాగ్ మాత్రమే తాను చెప్పానని ఆమె అన్నారు. తన ఉద్దేశం ప్రకారం చెప్పాలంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాట్లాడుకొని తనను పిలిచారని, అది మంచిదైనా, చెడ్డదైనా అది వాళ్లకే ఉంటుంది గానీ తనకేం సంబంధం అని ఆమె అన్నారు. అన్నపూర్ణమ్మతో ఇలాంటి వేషం వేయించారేంట్రా అని ప్రేక్షకుడు అనుకున్నాక అప్పుడు వాళ్లకే అర్థమవుతుందని ఆమె చెప్పారు.

కానీ ఆ తర్వాత మాత్రం మంచి క్యారెక్టర్‌ ఇచ్చారని, ఆ విషయం అప్పుడే చెప్పారని అన్నపూర్ణమ్మ తెలిపారు. తనకు సినిమాలో పెద్దగా కష్టపడి డైలాగేం చెప్పక్కర్లేదు అనుకుంటే మెలకువ ఉండక్కర్లేదని, వాళ్లు పిలిచే వారకూ కారవాన్ నిద్రపోతానని ఆమె చెప్పారు. అసంతృప్తి అలాంటివేం లేవని, కానీ ఏ పెద్ద హీరో అయినా సినిమా అంతా మనం ఎలాగూ ఉండమని, కానీ 2,3 సీన్లు ఉంటే కొంచం సంతృప్తిగా అనిపిస్తుందని ఆమె చెప్పారు. పెద్ద వేషం పడుతుందేమో అనుకుని పెట్టుకుంటారు గానీ అది అన్ని సార్లు జరగదని ఆమె అన్నారు. కొంత మందేమో మాట్లాడి వదిలేస్తారని ఆమె తెలిపారు.

తనకు నచ్చని, తనను మెచ్చని వాళ్లతో తాను మాట్లాడనని, వాళ్లకు తాను దూరంగా ఉంటానని అన్నపూర్ణమ్మ అన్నారు. మన కోసం మనం, మన తల్లి కోసం బతకాలని ఆమె చెప్పారు. ఇండస్ట్రీలో తనకు, చలపతి రావు గారికీ మంచి సంబంధం ఉందని ఆమె చెప్పారు. ఎందుకంటే అనుభవం ఉన్న ఆర్టిస్టు, ప్రొడ్యూసర్ ఆయన అని, అంతే కాకుండా ఏదైనా సలహా అడిగితే కరెక్టుగా చెప్తారని ఆమె అన్నారు. ఒకవేళ ఆయనకు తెలియకపోతే ఎవరినైనా అడిగి చెప్తానని అంటారని ఆమె తెలిపారు. దాదాపు ఏ జరిగినా తాను ఆయనతోనే పంచుకుంటానని ఆమె చెప్పారు.