బాబు చేసిన తప్పులే జగన్ ప్రభుత్వానికి నూతన ఉత్సహాన్ని ఇస్తున్నాయా??

cbn jagan

2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదట్లో తన పాలనలో తడపడ్డారు. అనుభవరాహిత్యం వల్ల చలం తప్పులు చేశారు. దాదాపు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కోర్ట్ ల ముందు నిలబడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలను పకడ్బందీగా ప్రయోగిస్తూ తన రాజకీయ చాణిక్యతను కనపరుస్తున్నారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకోనున్నారు.

jagan and cbn telugu rajyam
jagan and cbn telugu rajyam

చంద్రబాబు చేసిన తప్పే జగను ఊరటనిచ్చింది

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా తీసుకుంటున్న నిర్ణయాల్లో జిల్లాల విభజన కూడా ఒకటి. ఈ నిర్ణయం వెనక జగన్ చాలా పెద్ద వ్యూహం రచించారు. ప్రస్థుతానికి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అయితే ఈ ఇబ్బందులను నుండి బయటపడటానికి జిల్లాల విభజనను జగన్ ఉపయోగించుకొనున్నారు. కేంద్రం జిల్లాలను యూనిట్ గా తీసుకుని పెద్ద ఎత్తున నిధులను ఇస్తుంది. ఇక కొత్త జిల్లాలకు జిల్లా పరిషత్తులు కూడా వస్తాయి. వాటికి నేరుగా కేంద్రం నిధులు ఇస్తుంది. ఆ విధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంటుంది. పాలన కూడా దగ్గరై ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం అవుతాయి. ఇలా రాష్ట్ర యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఈ జిల్లాల విభజన అంశం చంద్రబాబు నాయుడు పాలనలోనే పరిగణనలోకి వచ్చింది. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు అమలు చేయలేకపోయారు. జిల్లాల విభజన చేసి ఉంటే పార్టీకి రాజకీయంగా చాలా ఉపయోగం ఉండేది కానీ జిల్లాల విభజన చెయ్యకుండా తప్పు చేశారు. ఇప్పుడు ఆ తప్పే జగన్ ప్రభుత్వానికి కలిసి వచ్చింది.

రాజకీయంగా బలపడనున్న వైసీపీ

ఈ నూతన జిల్లాల విభజన అంశం వైసీపీకి రాజకీయంగా చాలా ఉపయోగపడనుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీ జిల్లాల విభజన వల్ల మరింతగా ప్రజాలకు చేరువ అయ్యి, రాజకీయంగా బలపడనుంది. చాలా ప్రాంతలను జిల్లాలుగా మార్చడం వల్ల అక్కడి ప్రజల్లో వైసీపీపై ఆదరణ పెరుగుతుంది, అలాగే అక్కడ కేంద్రం చేసే అభివృద్దిడ్ కూడా వైసీపీ ఖాతలొకే రానుంది. అలాగే పరిపాలన కూడా జిల్లాల విభజన వల్ల సులభతరం అవుతుందని రాజకీయ వర్గాలు చెప్తున్నారు.