2019 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్ట ఎంతలా దిగజారిందో అందరికి తెలుసు. ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు వైసీపీ, బీజేపీలోకి వెళ్తున్నారు. ఇంకొన్నాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీలో చెప్పుకోవడానికి బలమైన నేత ఒక్కరు కూడా ఉండరు. అయితే ఇప్పుడు టీడీపీలో హవా కొనసాగిస్తున్న నేతల్లో అచ్చెన్న, బుచ్చెయ్యలేనని రాజకీయ వర్గాలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్యే రాజకీయ యుద్ధం మొదలు అయ్యేలా ఉంది. ఈ యుద్ధం చంద్రబాబు నాయుడుకి అగ్ని పరీక్ష లాంటిది.
రాజకీయ వారసుడిని దింపనున్న బుచ్చయ్య
బుచ్చయ్య మొదటి నుండి టీడీపీలోనే ఉన్నప్పటికీ చంద్రబాబు ఆయనను కేవలం ఎమ్మెల్యే పదవికే అంకితం చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. 2024లో వ్యాక్సి ఎన్నికల సమయానికి తాను రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సోదరుడు కుమారుడిని తన రాజకీయ వారసుడిగా తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ప్రయత్నాలు ఇప్పుడు అచ్చెన్నకు, బుచ్చయ్యకు యుద్ధం మొదలు పెట్టాయి. రాజమండ్రి అర్బన్ సీటు కి తన వారసుడికి ఇవ్వాలని బుచ్చయ్య ప్రతిపాదిస్తున్నారు. మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది అచ్చెన్నాయుడు అన్న కూతురు ఆదిరెడ్డి భవానీ. ఇలా ఇప్పుడు ఈ ఇద్దరి నేతలు మధ్య రాజకీయ యుద్ధం మొదలు అయింది.
చంద్రబాబు ఎవరి వైపు
పార్టీ ప్రెసిడెంట్ అచ్చన్నాయుడికి, పార్టీ సీనియర్ నేత బుచ్చన్న మధ్య జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధంలో ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఇప్పుడు టీపీడీ నేతల్లో చర్చ జరుగుతుంది. అయితే చంద్రబాబు గురించి తెలిసిన వారు మాత్రం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అచ్చెన్నకే మద్దతు ఇస్తారని, మొదటి నుండి కూడా బుచ్చన్నపై బాబుకు మంచి అభిప్రాయం లేదని, అందుకే బుచ్చన్నకు అర్హత ఉన్నప్పటికీ కేవలం ఎమ్మెల్యే పదవికి పరిమితం చేశారని చెప్తున్నారు. చివరికి ఈ యుద్ధం టీడీపీలో ఎన్ని అలజడులు సృష్టిస్తుందో వేచి చూడాలి.