Crime News: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. పరీక్ష రాసి ఇంటికి వెళుతుండగా…!

Crime News: ప్రతిరోజు దేశంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాలను నడిపే సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యం, అజాగ్రత్త,అతివేగంగా వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొని ఎంతోమంది మరణిస్తున్నారు. ఇటీవల కర్ణాటక లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు.

వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని హాసన్-బేలూర్ రోడ్డులో ఈ ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీయూసీ హిందీ పరీక్షకు హాజరైన విద్యార్థులు పరీక్ష ముగిసిన తరువాత ఇంటికి వెళ్లేందుకు అక్మల్ ఖాన్, మహమ్మద్ జిలానీలు తమ స్నేహితులతో కలిసి కారులో బయలుదేరారు.రియాజ్ కారు నడుపుతున్న సమయంలో ముందు ఉన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలని ప్రయత్నించినప్పుడు కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆర్ టి సి బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మరొక విద్యార్థి కి తీవ్ర గాయాలు అయ్యాయి.

గాయాలు తగిలిన విద్యార్థిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలు ఎత్తుకుపోవడం పాటించడం కోసం ఎక్కువ సమయం పట్టింది. ఈ తరుణంలో దాదాపు గంటపాటు హైవే మీద ట్రాఫిక్ జామ్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు. మరణించిన వారిలో జేపీ నగర్, బేలూరు తాలూకాకు చెందిన రియాజ్, ఫయాజ్ అహ్మద్, అక్మల్ ఖాన్, మహ్మద్ కైఫ్, సుహిల్‌లుగా గుర్తించారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.