Crime News: రోజురోజుకీ ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. స్టేషన్ ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ.. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. రోజురోజుకీ ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.ఇటీవల రాజస్థాన్ లో ఇలాంటి విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదవ తరగతి చదువుతున్న బాలికపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. అంతేకాకుండా ఆ నీచాన్ని వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే… ఇంట్లో లో ఉన్న డబ్బు బంగారు ఆభరణాలు కనిపించకపోవటంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.గత నెల 24న దౌసా జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ఐదుగురు వ్యక్తులు మహ్వా- మండవార్ రోడ్డులోని ఓ హోటల్‌కు తీసుకువెళ్లి మత్తు మందు ఇచ్చి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకరైన వివేక్ శర్మ అనే వ్యక్తి గ్యాంగ్ రేప్ కు సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బాలికను వేధించటం మొదలుపెట్టాడు.
ఇలా బాలికను బెదిరించి ఆమె నుండి పదిహేను లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. ఈ కాలంలో ఇంట్లో ఉన్న డబ్బు బంగారు నగలు కనిపించకపోవటంతో సదరు బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు.మొదట పోలీసులు ఈ కేస్ ను దొంగతనం కేసు గా నమోదు చేసుకున్నారు. పోలీసుల విచారణలో వివేక్ శర్మ ప్రమేయం ఉన్నట్టు తేలింది. ఈ తరుణంలోనే బాలిక పని మీద జరిగిన అత్యాచార ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పటం వల్ల గ్యాంగ్ రేప్ విషయం బయటికి వచ్చింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి వాంగ్మూలం తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఒక ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి జాతీయ మహిళాకమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన వెంటనే నిందితులను శిక్షించాలని డిమాండ్ చేసింది.