New Year celebrations: కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరు ఎంతో వేడుకగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ క్రమంలోనే దేశంలో ప్రతి పట్టణం నుంచి గ్రామాల వరకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా కేక్ కటింగ్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ క్రమంలోనే ఒడిశాకు చెందిన కొందరు పోలీసులు పెద్ద ఎత్తున మేకలు కోసి పార్టీ చేసుకున్నారు. అయితే ఆ మేకలు వారు సొంత డబ్బులతో కొన్నవి కాదండోయ్… మేక కోసం పోలీసులు దొంగలుగా మారి దొంగలించిన మేకతో న్యూ ఇయర్ దావతు చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
సింధికెల గ్రామానికి చెందిన సంకీర్తనగురు మేకలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. డిసెంబరు 31న అంతటా పండగ వాతావరణం నెలకొన్నప్పటికీ సంకీర్తన గురు తన మేకలను మేపుకోసం తీసుకువెళ్లాడు.అయితే మధ్యాహ్నం తన మందలో రెండు మేకలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతం మాత్రమే ఇచ్చారు. ఆ పరిసర ప్రాంతంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇలా మధ్యాహ్నం తప్పిపోయిన మేకలను సాయంత్రం పోలీస్ స్టేషన్ లో పోలీసులు వాటిని చంపుతుంటే సంకీర్తన గురు కూతురు చూసి ఈ విషయాన్ని తన తండ్రికి చేరవేసింది.
ఈ విషయం తెలుసుకున్న అతను గ్రామస్తులను వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్ కి చేరుకుని పోలీసులను నిలదీయగా పోలీసులు మీకు చేతనైనది చేసుకోండి అంటూ వారిపై దుర్భాషలాడారు దీంతో మీడియా ద్వారా ఈ విషయం కాస్తా జిల్లా ఎస్పీ నితిన్ శుక్లాకర్ దృష్టికి వెళ్లింది. పోలీస్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సూచించారు. ఈ విచారణలో భాగంగా పోలీసులు దొంగలుగా మారారని తెలియడంతో వెంటనే పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు.ఈ విషయం తెలిసిన పలువురు నెలకు వేలకు వేలు జీతాలు వస్తున్నాయి కదా దాంతో పార్టీలు చేసుకోకుండా ఇలా కక్కుర్తి అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మీలాంటి వారి వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.