గెటవుట్ అంటూ జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసిన నరేష్.. ప్రోమో వైరల్!

గెటవుట్ ఈ పదం గురించి మనకు ఎప్పటి నుంచో తెలిసినప్పటికీ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది. ఎప్పుడైతే యాంకర్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ ను గెట్ అవుట్ అనిందో అప్పటి నుంచి ఈ పదం బాగా పాపులర్ అయింది. ఇక ఈ విషయం గురించి పెద్ద ఎత్తున వివాదాలు గొడవలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. కేవలం ఒక ఫ్రాంక్ వీడియోలో భాగంగా ఇంత పెద్ద వివాదం చెలరేగిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఏ విషయం అయితే ట్రెండింగ్ అవుతూ ఉంటుందో దానికి కాస్త ఫన్ జోడించి స్కిట్ చేయడంలో జబర్దస్త్ కమెడియన్స్ ముందు వరుసలో ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమోలో భాగంగా పొట్టి నరేష్ దేవి నాగవల్లి ఉపయోగించిన గెటవుట్ అనే పదం పై స్కిట్ చేసి అందరిని నవ్వించారు. కెవ్వు కార్తీక్ తో కలిసి చేసిన ఈ స్కిట్ అద్భుతంగా పండింది. ఈ స్కిట్ లో భాగంగా పొట్టి నరేష్ కెవ్వు కార్తిక్ ను గట్టిగా కొడతాడు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అంటూ ఉంటే వెంటనే పొట్టి నరేష్ దేవి నాగవల్లి డైలాగ్ పేల్చాడు.

కెవ్వుకార్తిక్ డైలాగ్ చెప్పడంతో పొట్టి నరేష్ గెటవుట్… గెటవుట్ అని యాంకర్ దేవి నాగవల్లిని ఇమిటేట్ చేశారు. కెవ్వుకార్తిక్ సైతం విశ్వక్ ఉపయోగించిన F*** పదం వాడబోతుంటే నో… ఈ స్కిట్ నుంచి గెటవుట్ అంటూ దేవి నాగవల్లిని ఇమిటేట్ చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో దేవి నాగవల్లిని ఇమిటేట్ చేయడంతో ఈ కార్యక్రమానికి హాజరైన అనిల్ రావిపూడి పగలబడి నవ్వారు. మొత్తానికి ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.