Ilaiyaraja: టెంపుల్ వివాదంపై స్పందించిన ఇళయరాజా.. కావాలనే చేస్తున్నారంటూ!

Ilaiyaraja: ప్రస్తుతం మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నిన్నటి నుంచి ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన ఒక వైరల్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో ఎట్టకేలకు ఈ వీడియో పై ఆయన స్పందించారు.. అసలు ఏం జరిగిందంటే.. తాజాగా ఇలయ రాజా శ్రీవిల్లి పుత్తూరు అండాల్ ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆలయంలో చిన్న జీయర్ స్వాములు ఆయనను అడ్డుకున్నారు.

 

ఆయనను అక్కడి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి పంపించేశారు. దీంతో ఆయనకు అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఆలయంలోకి ప్రవేశించిన ఆయనను వెనక్కి పంపడం పెద్ద వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఇళయరాజాకు అనుకూలంగా.. కొందరు. ఆయనకు వ్యతిరేకంగా పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఆలయ అధికారులు స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్వయంగా ఇళయరాజా స్పందిస్తూ..

 

నాపై కొందరు పుకార్లు పుట్టిస్తున్నారు. అలాంటిదేమీ జరగలేదు. నా ఆత్మగౌరవాన్ని నేను ఎప్పుడూ తక్కువ చేసుకోను అని తన సోషల్ మీడియా ఖాతాలోని ఒక పోస్టులో రాసుకొచ్చారు. కొందరు నాపై తప్పుడు పుకార్లు ప్రచారం చేస్తున్నారు. నేను నా ఆత్మగౌరవం విషయంలో రాజీ పడేవాడిని కాదు, ఎప్పటికీ అలా ఉండను. జరగని విషయాలను ప్రచారం చేస్తున్నారు. అభిమానులు, ప్రజలు ఈ పుకార్లను నమ్మవద్దని ఆయన తన పోస్ట్ ద్వారా తెలిపారు.