Chanakya-Niti: సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని భావిస్తారు.ఈ క్రమంలోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి జీవితాంతం సంతోషంగా గడపాలనేది ఎంతో ముఖ్యమైనది. ఒక మనిషి జీవితంలో విజయం సాధించాలన్న వారి జీవితాన్ని నాశనం చేసుకోవాలన్న యవ్వనదశ కీలకమైనదని ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథం ద్వారా తెలియజేశారు. ప్రతి ఒక్క మనిషి యవ్వనంలో ఈ పద్ధతులను పాటించడం వల్ల జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుతారని చాణిక్యుడు తెలిపారు. మరి ఆ లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం: జీవితంలో మనం ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే యవ్వనంలో చెడు అలవాట్లకు బానిస కాకూడదని ఆచార్య చాణిక్యుడు తన నీతి గ్రంథం ద్వారా తెలిపారు. యవ్వనదశలో మంచి కన్నా చెడుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ చాలామంది ఈ విధమైనటువంటి చెడు వ్యసనాలకు బానిస అవుతారు. ఈ చెడు వ్యసనాలు పూర్తిగా జీవితాన్ని నాశనం చేస్తాయని చెప్పవచ్చు.
క్రమశిక్షణ: ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే వారి యవ్వన దశలో తప్పనిసరిగా క్రమశిక్షణ అలవర్చుకోవాలి. యవ్వనదశలో క్రమశిక్షణ అలవాటు పడితే సకాలంలో పూర్తి చేయాల్సిన పనులను పూర్తిచేస్తారు తద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు.
ఆత్మవిశ్వాసం: జీవితంలో దేనినైనా సాధించాలి అనే పట్టుదల ఉంటే ముందుగా మనపై మనకు ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే మనం తొందరగా దేనినైనా సాధించగలము. అప్పుడే మనం అనుకున్న విజయాలను చేరుకోగలుగుతారని ఆచార్య చాణక్యుడు. తన నీతి గ్రంథం ద్వారా ఒక మనిషి విజయపథంలో నడవాలంటే ఈ లక్షణాలను పాటించాలని తెలిపారు.