Lakshmi Devi: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్క భావిస్తాము. తులసిని సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కనుక ప్రతి ఒక్కరు వారి ఇంటి ఆవరణలో తులసి మొక్కలు పెద్ద పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉంటారు.ఇలా ఎంతో శుభప్రదమైన తులసి మొక్కతో కొన్ని ఉపాయాలు పాటించడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే మన ఇల్లు అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలంటే తప్పనిసరిగా ఈ ఉపాయనాలు పాటించాలి. మరి అవి ఏమిటి అనే విషయానికి వస్తే…ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ భగవంతుని స్మరిస్తూ దీపారాధన చేస్తూ ఉంటాము. ఈ క్రమంలో ప్రతి రోజు పూజ తర్వాత తులసి ఆకులను నీటిలో వేసి ఆ నీటిని ఇంటి ఆవరణంలో ఇంటిలోపల చల్లాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
అలాగే ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉంటే అలాంటి వారు ఈ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. అదేవిధంగా తులసి నీటితో స్నానమాచరించడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలంటే మూడు రోజుల పాటు తులసి ఆకులను నీటిలో వేసి మూడు రోజుల తర్వాత ఆ నీటిని మన వ్యాపార ప్రాంతంలో చల్లడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది.