New Year: కొత్త ఏడాదిలో మీ కోరికలు తీరాలంటే ఇలా రాసి దేవుడికి సమర్పించాలి..!

New Year: కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రతి ఒక్కరు ఎన్నో ఆశలను, కోరికలను పెట్టుకుంటారు. వచ్చే ఏడాది అయిన వారు అన్ని విషయాలలో విజయం సాధించాలని మనసారా కోరుకుంటారు.ఈ క్రమంలో వచ్చే ఏడాది మన పనులన్నీ సక్రమంగా జరిగి మన విజయపథంలో దూసుకుపోవాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.మరి ఈ కొత్త సంవత్సరంలో మొదటి రోజు ఎలాంటి నియమాలను పాటించాలి మన కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

కొత్త ఏడాది ప్రారంభం అవడంతో ముందుగా వినాయకుడికి పూజ చేసిన అనంతరం ఇష్టదైవానికి పూజ చేసుకోవాలి. అలాగే కొత్త ఏడాది మనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం లక్ష్మీదేవి చిత్రపటాన్ని పర్సులో ఉంచుకోవాలి. అదేవిధంగా రావి చెట్టు ఆకు పై ఓం అని రాసి ఆ రావి ఆకును పర్సులో పెట్టుకోవడం వల్ల మనం చేసే పనులలో విజయం వరిస్తుంది.

అలాగే కొత్త ఏడాదిలో మనం కోరుకున్న కోరికలు నెరవేరాలంటే ఎర్రనీ కాగితంపై మన కోరికను రాసి దానిని మన ఇష్టదైవాలయంలో ఉంచి ఆ కోరిక నెరవేరాలని ప్రతిరోజూ భగవంతుని ప్రార్థించడం కాకుండా కోరిక నెరవేర్చడం కోసం మనవంతు కృషి చేయాలి.అలాగే మనకు కొత్త సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మన ఇంటిలో ఉత్తరం వైపు మట్టి కుండలో నీటిని పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవని జ్యోతిష్యులు చెబుతున్నారు.