Lakshmi Devi: సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితం ఎంతో సంతోషంగా కొనసాగాలని భావిస్తారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఎన్నో పూజా కార్యక్రమాలు చేస్తూ ఆ భగవంతుడు ఆశీర్వాదాలు తీసుకుంటారు. ముఖ్యంగా మనకు ఆర్థిక సమస్యలు లేకుండా అష్ట ఐశ్వర్యాలు కలగాలని మన ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలంటే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి అని చెబుతుంటారు. అయితే అమ్మవారి అనుగ్రహం మనపై ఉండడం కోసం అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే విషయానికి…
లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలంటే అమ్మవారిని స్పటిక మాలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ఎంతో స్వచ్ఛమైన తెలుపు రంగు కలిగిన స్పటికమాల అమ్మవారికి ఎంతో ప్రీతికరం. కనుక ఈ విధమైనటువంటి స్పటిక మాలతో పూజించడంవల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిరిసంపదలు కలిగేలా అనుగ్రహిస్తుంది.
ఈ క్రమంలోనే స్పటిక మాలతో అమ్మవారి ఫోటోని అలంకరించడం,అలాగే స్పటిక మాలతో యోగ, ధ్యానం వంటి వాటిని చేయడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది. స్పటిక మాల ధరించి పూజలు చేయటం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా అనుకూల వాతావరణం కలుగుతుంది. ఈ క్రమంలోనే మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా మనం ఎల్లప్పుడూ సిరిసంపదలను కలిగి ఉంటామనీ పండితులు చెబుతున్నారు.