వామ్మో శ్రీముఖి దూకుడు చూస్తుంటే సుమని మించిపోయెలా ఉందే..?

బుల్లితెర గ్లామరస్ యాంకర్ శ్రీముఖి గురించి తెలియని వారంటూ ఉండరు. టీవీ షోస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాలలో నటిస్తూ అటు వెండితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది. అదుర్స్ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి పటాస్ షో ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత చానల్ తో సంబంధం లేకుండా అన్ని చానల్స్ లో ప్రసారమవుతున్న టీవీ షోస్ లో యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పండుగలు సందర్భంగా ప్రసారం అవుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక సినిమాలలో కూడా ప్రధాన పాత్రలలో నటిస్తూ నటిగా కూడా మంచి గుర్తింపు. జులాయి సినిమా ద్వారా నటిగా తన కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపించనుంది. ఇలా సినిమాలు టీవీ షోస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందమైన ఫోటోలు షేర్ చేయటంతో పాటు తన లైఫ్ కి సంబంధించిన అనేక విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకొని పాపులర్ అయింది.

ఇక తాజాగా శ్రీముఖికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీముఖి టీవీ షోస్ తో పాటు సినిమా అవార్డు కార్యక్రమాలలో కూడా హోస్ట్ గా వ్యవహరించింది. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరులో జరిగిన 2022 సైమ అవార్డ్స్ ఈవెంట్ లో కూడా శ్రీముఖి హోస్ట్ గా సందడి చేసింది. అయితే ఈ ఈవెంట్ కోసం శ్రీముఖి భారీ స్ధాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ కోసం శ్రీముఖి రూ.20 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకోవడమే కాకుండా ఆమెకు సంబంధించిన ఇతర ఖర్చులు కూడా మేనేజ్మెంట్ వారు భరించినట్లు తెలుస్తోంది.

అయితే ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాంకర్ గా పేరుపొందిన సుమ కూడా ఒక్కో ఈవెంట్ కి రూ.20 లక్షలు రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఇక ఇప్పుడు సుమ తో సమానంగా శ్రీముఖి పారితోషికం తీసుకోవటంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక శ్రీముఖి దూకుడు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సుమని మించిపోతుంది కొందరి అభిప్రాయం.