Bolly wood celebrities: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు వారి వస్త్రధారణ విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా వారి కోసం ఒక డిజైనర్ నియమించుకొని ప్రత్యేకంగా దుస్తులను డిజైన్ చేయిస్తుంటారు.ఇలా దుస్తులను డిజైన్ చేయించడం కోసం కొన్ని లక్షలు కోట్లలో కూడా ఖర్చు చేస్తుంటారు.మరి కొందరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు వివిధ కార్యక్రమాలలో వారు ధరించిన డ్రెస్ ధరలు తెలిస్తే నిజంగా మతిపోవడం గ్యారెంటీ..
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాఇజ్రాయిల్ లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల లో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు ఈమె ధరించిన గులాబీ రంగు లెహంగా వజ్రాలతో పొదిగిన ఉంది. ఈ డ్రెస్సు ఖరీదు అక్షరాల 40 లక్షల రూపాయలు. 2019 సంవత్సరంలో యువరాణిలా దుస్తులు ధరించి మెట్ గాలాలో జరిగిన పింక్ కార్పెట్‌పై నడిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన దీపిక ధరించిన డ్రెస్ 50 లక్షల 50 వేల రూపాయలు. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా రస్సో తయారు చేసిన పూసలు ఉన్న తెల్లటి గౌను ధరించి 2020 గ్రామీ అవార్డ్స్‌కు హాజరయ్యారు ఈ డ్రెస్ ఖరీదు 77 లక్షలు.
అదేవిధంగానటి ఐశ్వర్యారాయ్ తన వివాహానికి ప్రత్యేకంగా బంగారు తీగలతో 75 లక్షల విలువచేసే చీరను డిజైన్ చేయించుకున్నారు. ఇక అనుష్క శర్మ తన పెళ్లి కోసం డిజైనర్ సభ్య సాక్షితో 30 లక్షల విలువ చేసే లెహంగా డిజైన్ చేయించుకున్నారు. శిల్పాశెట్టి తన పెళ్లి లో 800 స్వరోస్కీ క్రిస్టల్స్‌తో కూడిన డిజైనర్ చీరను ధరించింది. 50 లక్షలు ఇలా బాలీవుడ్ సెలబ్రిటీలు వారి వస్త్రధారణ విషయంలో ఎంతో శ్రద్ధ చూపించే ప్రత్యేకంగా డిజైన్ చేయించు కుంటూ ఉంటారు.