Shani Dosha Nivarana: హిందూమతంలో ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తారు. అలాంటి వృక్షాలలో రావి చెట్టు ఒకటి.రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉన్నారని భావిస్తారు కనుక పెద్ద ఎత్తున ఈ వృక్షానికి పూజలు చేయడం మనం చూస్తున్నాము. రావిచెట్టు మూలంలో బ్రహ్మ, కొమ్మలలో విష్ణువు, చెట్టు పై భాగంలో శివుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.ఇలా సకల దేవతలు కొలువై ఉన్న ఈ వృక్షాన్ని పూజించడం వల్ల ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శని దోషం ఉన్నవారు శనివారం రావి చెట్టును ఈ విధంగా పూజిస్తే శని దోష నివారణ జరుగుతుంది.
శని లేదా పితృ దోషాలు తొలగిపోవాలంటే తప్పనిసరిగా రావిచెట్టుకు పూజ చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని దోష నివారణతో బాధపడేవారు ప్రతి శనివారం సాయంత్రం రావి చెట్టుకు పూజ చేయాలి. శనివారం సాయంత్రం ఆవనూనెతో రావిచెట్టు కింద దీపం వెలిగించి శనీశ్వరుని కోసం ధ్యానం చేయాలి. అదేవిధంగా రావి చెట్టు చుట్టూ తొమ్మిదిసార్లు ప్రదక్షణ చేసి కొబ్బరికాయ కొట్టి అనంతరం ఆ కొబ్బరికాయను అక్కడే వదిలి రావాలి.
అలాగే పితృ, శని దోషాలు రెండు తొలగిపోవాలంటే శనివారం పాలు బెల్లం కలిపి రావి చెట్టుకు సమర్పించాలి. ఇలా పెట్టిన తర్వాత “శం శనీశారాయ నమః” అనే మంత్రాన్ని 27 సార్లు చదవటం వల్ల శని దోషంతో పాటు పితృ దోషం కూడా తొలగిపోతుంది. ఈ విధంగా శనివారం రావిచెట్టుకు పూజలు చేయడం వల్ల శని దోషం నుంచి విముక్తి పొందవచ్చు.