ఇదే జరిగితే ఆంధ్ర ప్రదేశ్ లో దుబ్బాక సీన్ రిపీట్ ?

 దుబ్బాక ఉప పోరులో విజయం సాధించిన బీజేపీ పార్టీ లో ఇప్పుడు నూతనోత్సహం తొణికిసలాడుతుంది. ఇదే ఊపులో తిరుపతి పార్లమెంట్ కు జరగబోయే ఉప ఎన్నికల్లో గెలిచి ఆంధ్రాలో కూడా బలమైన పార్టీగా ఎదగాలని పావులు కదుపుతుంది. దీనితో ఇప్పుడు బీజేపీ నేతల దృష్టి తిరుపతి మీద పడింది. దుబ్బాకలో ఘనవిజయం సాధించిన రఘునందన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తిరుమల రావటం జరిగింది. ఆయన మొక్కు చెల్లించుకోవటానికి తిరుపతి వచ్చిన కానీ, అక్కడ రాజకీయ గుబాళింపు గట్టిగానే కొట్టింది.

ap bjp

 రఘునందన్ రాకతో తిరుపతి బీజేపీ లో ఒక ఉత్సహం కనిపించింది. ఆయన వెళ్లిన తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలు కూడా తిరుపతి పర్యటనలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో తిరుపతిలో బీజేపీ నేతల హడావిడి ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఇక తిరుపతి పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ సరైన అభ్యర్థి కోసం వెదుకులాట మొదలుపెట్టింది. తెరాస బలంగా ఉన్నటువంటి దుబ్బాకలో బీజేపీ విజయం సాధించిందంటే దానికి కారణం రఘునందన్ లాంటి నిఖార్సైన అభ్యర్థి దొరకటమే, డబ్బు పెట్టటంలో కావచ్చు, పదునైన మాటలు విసరటంలో కావచ్చు, అద్భుతమైన వ్యూహాలు రచించడంలో కావచ్చు రఘునందన్ అదరకొట్టాడు.

 ఇప్పుడు తిరుపతిలో కూడా అలాంటి అభ్యర్థి కోసం చూస్తున్నారు బీజేపీ నేతలు. తిరుపతి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంమాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తిరుపతి ఎంపీగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు టాక్ వినబడుతోంది. జనసేన మద్దతుతో ఇక్కడ పోటీచేసి గెలవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య ని పోటీకి దించాలని పార్టీ పెద్దలు అనుకుంటున్నట్లు టాక్.

మరోపక్క వైసీపీ నుంచి అభ్యర్థి ఎవరు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో టికెట్ ఆశిస్తున్న వారు ఇప్పటికే సీఎం జగన్ ని కలిసి విన్నవించిన ట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దుబ్బాకలో సాధించిన విజయం తిరుపతిలో సాధించటం అంటే సాధారణ విషయం కాదు. బలమైన జగన్ ను తట్టుకొని నిలబడటం టీడీపీ కి కష్టంగా మారింది. మరి బీజేపీ ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.