Tolly Wood: టిడిపి అధికారంలో ఉంటే ఫిలిం ఇండస్ట్రీకి ఈ గతి వచ్చుండేది కాదు.. అంబికా కృష్ణ!

Tolly Wood: నిజం చెప్పాలంటే డబ్బు ఎవరికైనా డబ్బే ఆయన ఎంత ఖర్చు పెట్టాడు ఆయనకు లాభసాటి చేయాలి న్యాయం చేయాలి అనే ఆలోచన ఉండాలి తప్ప మార్కెట్ ఉంది కదా, 100 కోట్లలో 50 కోట్లు ఆయనకి ఎందుకు రావాలి ? 20 కోట్లు వస్తే చాలు కదా. లేదంటే నాతో సినిమా తీస్తే పేరు వస్తుంది కదా.. అనే ఆలోచనతో ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది అని ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ అన్నారు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం గా నేను ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను నిర్మాతకు కూడా డబ్బులు మిగలాలి కదా అనే ఒక విశాల దృక్పథం లేకపోవడం వలన ఇలా జరుగుతుందని ఆయన అన్నారు.

ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తనకు పదవి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా తాను కూర్చోకుండా పనిచేశానని అంబికా కృష్ణ అన్నారు. న్యాయం చేయాలనే ఉద్దేశంతో నంది అవార్డుల కోసం చాలా పోరాటం చేశామని ఆయన తెలిపారు. కానీ అది కుదరక నాటకం నంది అవార్డులను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశానని ఆయన చెప్పుకొచ్చారు.

ఇకపోతే సినీ ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా తాను నిర్మాత కాబట్టి సమస్య ఏమిటో తనకు తెలుసు కాబట్టి ఒక ప్రపోజల్ తీసుకొచ్చి ఓకే చేయించాలని ఆయన అన్నారు. ఏపీలో చిన్న చిన్న బడ్జెట్ సినిమా తీస్తే వాళ్లకు టాక్స్ సబ్సిడీ ఇస్తామని ఆయన ప్రకటించినట్లు తెలిపారు. దాంతోపాటు లొకేషన్స్ కూడా ఫ్రీగా ఇస్తామని అని ఒక జీవో తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ఆ ప్రకటనతో దాదాపు 30 సినిమాలు రిజిస్టర్ చేసుకున్నారు అని కూడా అంబికా కృష్ణ అన్నారు. వైజాగ్ కి ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకురావాలనే ఉద్దేశంతో 110 ఎకరాల స్థలం చూసి అందరూ సంతకాలు చేసి సీఎం ఆఫీస్ కి పంపించామని ఆయన అన్నారు. ఆ తర్వాత ఎన్నికలొచ్చాయి గవర్నమెంట్ పడిపోయింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ టిడిపి అధికారంలో ఉంటేప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఇలాంటి గతి పట్టేది కాదని నిర్మాత అంబికా కృష్ణ ఈసందర్భంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.