తిరుపతి లో పోటీచేస్తే జనసేన దుకాణం బంద్ అయ్యినట్లే ..?

pawan kalyan janasena

 తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు అన్ని సిద్ధం అవుతున్నాయి. ఇక జనసేన కూడా తిరుపతిలో పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పాతికేళ్ల ప్రస్థానం అంటూ రాజకీయం మొదలెట్టిన పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నాడో, అయన రాజకీయ పయనం ఎటువైపు వెళ్తుందో కూడా సరిగ్గా తెలియటం లేదు.

pawan kalyan janasena

అయోమయంలో జనసేనాని

 వాస్తవానికి తనకు గెలుపు ఓటములతో సంబంధం లేదని జనసేనాని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ప్రకటించారు. అయితే.. దానికి తగిన విధంగా ఆయన ఎక్కడా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగింది లేదు. పైగా.. మీరందరూ.. సంపాయించుకుంటున్నా రు… నేనెందుకు ఖాళీగా ఉండాలి-అంటూ.. సినిమాల్లోకి వెళ్లిపొయారు. ఈ ప్రభావం పార్టీపై తీవ్రంగా పడింది. కార్యకర్తలు కకావికలం అయ్యారు. మేధావులు అనుకున్న జేడీ లక్ష్మీనారాయణ వంటివారు పార్టీకి దూరమయ్యారు.

బీజేపీతో పొత్తు అతిపెద్ద తప్పు

 2019 లో గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే వైసీపీకి మద్దతు పలకడంతో జనసేన వాయిస్ ఎక్కడ వినిపించే అవకాశం లేకుండా పోతుంది. దీనితో బీజేపీతో కలిసి నడవాలని పవన్ కళ్యాణ్ భావించాడు. ఆ నిర్ణయం ఇప్పుడు జనసేన పార్టీకి ఎసరు తీసుకోని వస్తుంది. ఏ ఉనికిని కాపాడుకోవాలని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో, ఇప్పుడు అదే ఉనికి ప్రశ్నర్ధకం అయ్యేలా కనిపిస్తుంది. బీజేపీకి మిత్ర పక్షము అవ్వటంతో బీజేపీ చేస్తున్న తప్పులకు జనసేన కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పోలవరం విషయంలో బీజేపీ చేస్తున్న అన్యాయం గురించి ప్రతి ఆంధ్రుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, కానీ బీజేపీ నేతలు దీనిపై మాట్లాడటం లేదు. ఒక వేళా పవన్ కళ్యాణ్ బయటకు వస్తే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పైగా జనసేనను ఉపయోగించుకొని బీజేపీ ఎదగాలని భావిస్తుంది, ఈ తరహా ఆలోచన జనసేనకు భారీనష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది.

pawan kalyan janasena party

తిరుపతిలో పవన్ ముందున్న సవాళ్లు

 తిరుపతిలో బీజేపీ పార్టీ పోటీచేయాలని భావిస్తుంది, అదే సమయంలో జనసేన కూడా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల దాక పొత్తు కొనసాగించాలని ముందుగా అనుకున్నాయి, కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం ఒక పార్టీ నుండి అభ్యర్థి నిలబడితే, మరో పార్టీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. మరి తిరుపతిలో ఏ పార్టీ నుండి అభ్యర్థిని ఖరారు చేస్తారో చూడాలి. ఈ రెండు పార్టీల సొంత బలాబలాలు చూస్తే తిరుపతిలో విడివిడిగా పోటీచేస్తే కనీసం డిపాజిట్లు కూడా రావటం కష్టం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కలిసే పోటీచేయాలి, అయితే బీజేపీని కాదని తమ అభ్యర్థిని నిలబెట్టే సత్తా పవన్ కళ్యాణ్ కు ఉందా అనేది సందేహం.

 ఒక వేళా ఎవరు నిలబడిన కానీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాల్సిందే, ఆ సమయంలో పోలవరం గురించి మూడు రాజధానుల గురించి పవన్ కళ్యాణ్ ఏమని సమాధానం ఇస్తాడు. బీజేపీ తప్పించుకుంటున్నట్లు పవన్ కూడా తప్పించుకోవాలంటే జరిగేపని కాదు, అలాగని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే సత్తా జనసేనానికి లేదని విశ్లేషకుల చెపుతున్న మాటలు. మరి ఇలాంటి స్థితిలో పవనుడు ఎలా ముందుకు వేళ్తాడో తెలియని పరిస్థితి ఉంది. గతంలో దుబ్బాక ఎన్నికల సమయంలో ఎలాగైతే తనకేమి తెలియదన్నట్లు మౌనంగా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉండిపోతే మంచిదని కొందరు చెపుతున్న మాటలు