రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎదగాలనుకుంటున్న బీజేపీ ఇప్పుడు పొత్తుల కోసం ఎదురు చూస్తుంది. ఈ పొత్తుల వ్యవహారంలో ఏపీలో ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్నప్పటికీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పొత్తు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. జగన్ మీద ఉన్న ఆశతో టీడీపీ అధినేత, రాజకీయ పండితుడైన చంద్రబాబు నాయుడును కూడా పక్కన పెడుతున్నారు. అయితే బీజేపీ నేతలు తనను పట్టించుకోకపోయినా కూడా చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా బీజేపీ భజన చేస్తున్నారు. అయితే జగన్ ఢిల్లీ పర్యటన తరువాత జగన్ ఎన్డీయేలో చేరడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ ఎన్డీయేలో చేరితే బీజేపీపైనే తన భవిష్యత్ రాజకీయాలను ప్లాన్ చేసుకున్న చంద్రబాబు ఏమి చేస్తారన్నది ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బీజేపీపై బాబు పతకం ఏంటి ?
జగన్ ఎన్డీయేలో చేరితే మాత్రం టీపీడీకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పతనావస్థకు చేరుకున్న టీడీపీ బీజేపీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ ఆశలన్నీ జగన్ రానున్న మట్టిపాలు చేయనున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే జగన్ ఎన్డీయేలో చేరిన మరు క్షణమే బాబు తన రాజకీయ చాణిక్యతను చూపించి, కాషాయం మీద కస్సుమంటారని, ఆ వెంటనే కమ్యూనిజం మీద ప్రేమ చూపిస్తూ, కాంగ్రెస్ తోనే దోస్తీకి అర్రులు చాస్తారని, ఏపీలోనే కాదు, జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమిలోకి దూకేందుకు రెడీ అవుతారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
జగన్ ఎన్డీయేలో చేరకపోతే?
ఒకవేళ చంద్రబాబు నాయుడు అదృష్టం బాగుండి జగన్ మోడీకి, బీజేపీకి సారి చెప్పి ఎన్డీయేలో చేరకపోతే బాబులో ఢిల్లీకి వినపడేలా ఏపీలో సంబరాలు చేసుకుంటారు. జగన్ కాదంటే ఏపీలో బీజేపీకి ఉన్న ఏకైక ఆప్షన్ బాబునే, కాబట్టి బీజేపీ టీడీపీతో కలిసి రానున్న ఎన్నికలకు సిద్ధమవుతారు. బీజేపీతో కలిసి జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టె నిర్ణయాలు తీసుకుంటారని, అలాగే కేసులతో జగన్ ను, వైసీపీ నాయకులను ఇబ్బందులు పెట్టె అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చంద్రబాబు భవిష్యత్ రాజకీయం మొత్తం జగన్ చెప్పే ‘యస్’ అనో లేదా ‘నో’ అనో చెప్పే పదాలపై ఆధారపడి ఉంది.