Head Phones: హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా? వాటి నష్టాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Head Phones:పూర్వం ఒకరి నుండి ఒకరికి సమాచారం ఇవ్వాలి అంటే లెటర్ రూపంలో పంపేవారు. మారుతున్న కాలంతో పాటు మానవ శైలిలో చాలా మార్పులు సంభవించాయి. ఇప్పుడు చేతిలో మొబైల్ ఫోన్ లేనివారు లేరు అంటే నమ్మడం అతిశయోక్తి కాదు. ఎక్కడైనా జర్నీ చేస్తున్నా, ఒంటరిగా ఉన్నా ఎక్కువగా మొబైల్ చూడటం అందరికీ పరిపాటి అయ్యింది. అంతేకాకుండా చాలామంది మానసిక ప్రశాంతత కోసం సంగీతాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే పక్కన వారికి ఇబ్బంది కలగకుండా ఇయర్ ఫోన్స్ వాడటం ఈ మధ్యకాలంలో అలవాటుగా మారింది. చాలా మంది బ్లూటూత్, హెడ్ ఫోన్స్ ఉపయోగించటం చూస్తుంటాము. అయితే టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ఎక్కువ కాలం హెడ్ ఫోన్స్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యం మీద చాలా ప్రతికూల ప్రభావాలు పడతాయి. చాలా అనారోగ్య సమస్యలను చవిచూస్తారు.

మనిషికి చూపు, వినికిడి, మాట్లాడటం ఎంతో అవసరం. వీటిలో ఏ ఒక్కటి పని చేయకున్నా వారి జీవితం లో చాలా కోల్పోయినట్లే. పక్కన వారికి డిస్ట్రబ్ అవుతుందని మీరు హెడ్ సెట్ వాడితే మీ వినికిడి శక్తి నీ మీరే నాశనం చేసుకున్నవారవుతారు.

అతిగా హెడ్ సెట్ వాడితే ఆ శబ్దం డైరెక్ట్ గా మీ ఇయర్ డ్రమ్స్ మీద ప్రభావం చూపుతుంది. మెల్లగా వినికిడి శక్తి తగ్గిపోతుంది. అదే స్పీకర్స్ ద్వారా వింటే వచ్చే శబ్దంలో కొంత భాగమే మీ చెవులకు చేరుతుంది. అదే ఇయర్ ఫోన్ ద్వారా అయితే డైరెక్ట్ గా ఇయర్ డ్రమ్స్ మీద ప్రభావం చూపుతుంది.

ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల చెవులకు కాకుండా వేరే ఇతర శరీర భాగాలకు కూడా నష్టం వాటిల్లుతుంది. ఎక్కువ శబ్దం తో వినడం వల్ల అది మీ బ్రెయిన్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. భవిష్యత్తులో మతిమరుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వయసు వయసు పెరిగే కొద్దీ ఆలోచించే శక్తి కూడా తగ్గిపోతుంది.

అనేక మంది రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటపుడు కూడా ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు. దీనివల్ల అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒకరి ఇయర్ ఫోన్స్ ఒకరు వాడటం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఎక్కువ శబ్దం తో మీరు కనుక మ్యూజిక్ వింటే మీ చెవులలో తిమ్మిరి వచ్చేలా చేస్తాయి. ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల చెవుల్లోకి గాలి వెళ్ళకుండా చేసి ఇన్ఫెక్షన్ అవుతుంది. దీనివల్ల ఎక్కువ గులిమి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కచ్చితంగా ఇయర్ ఫోన్స్ వాడవలసి వస్తే సౌండ్ తక్కువ పెట్టుకొని వాడటం మంచిది. హెడ్ ఫోన్స్ ని అప్పుడప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి, దీనివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కు గురి అవ్వరు. వీలైనంత తక్కువగా హెడ్ ఫోన్స్ ని వాడటం ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం.