Kangana: నాన్న మాటే వినను.. ఇక అతని మాట ఏం వింటాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన కాంట్రవర్సి బ్యూటీ!

Kangana: వివాదాల రాణి కంగనా రానౌత్ మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. దీపిక పడుకొనే నటించిన సినిమా గేహ్రెయిన్ కరణ్ జోహార్ నిర్మించాడు. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా కామెంట్లు చేసిన కంగనా కరణ్ జోహార్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి . ఇంతకీ కంగనా చేసిన కామెంట్ ఏంటంటే చిన్నపుడు మా నాన్న చెబితేనే వినని నేను ఇపుడు ఈ ‘బిగ్ డాడీ’ కరణ్ జోహార్ చెబితే వింటానా అని కామెంట్ చేసింది.

ఇక కంగనాఏ విషయమైనా కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పే మనస్తత్వం తనదని అందరికీ తెలిసిన విషయమే.ఈ క్రమంలోనే ప్రతి విషయంలోనూ ఈమె తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఉంటారు ఈ క్రమంలోనే తాజాగా కరణ్ జోహార్ గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే రాబోయే మూవీ తేజస్ లో ఎయిర్ పైలట్ గా కన్పించనుంది. ఈ సినిమా కు సర్వేష్ మేవారా డైరెక్టర్. ఇక కంగనా చేతిలో యాక్షన్ ప్యాకెడ్ మూవీ “దక్కాడ్”, మణికర్ణిక రిటర్న్స్, ది లెజెండ్స్ అఫ్ దిద్ధా ఉన్నాయి. ఇక బుల్లి తెర పై లాక్ అప్ అనే షో కి హోస్ట్ గా కూడా చేస్తోంది.

ఇక తన వివాదాస్పద మాటల గురించి అడుగగా ఏ విషయం గురించైనా సూటిగా మాట్లాడుతుంటే కెరీర్ లో సక్సెస్ తర్వాత ఇలాంటి మాటలు వస్తాయని రోజు వార్తల్లో నిలవడం కోసం చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నానని అంటున్నారు. కానీ ఏ కెరీర్ లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డానని ఒక గుర్తింపు వచ్చాక విమెన్ ఎంపవర్మెంట్ కి సంబందించిన సినిమాలు నటించడానికి ఆసక్తి చూపుతున్నానని చెప్పింది