Amrita Rao: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమృత రావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తర్వాత రేడియో జాకీ అన్‌మోల్‌ను వివాహం చేసుకొని సినిమా ప్రపంచానికి దూరం అయింది.ఇలా సినీ ప్రపంచానికి దూరమైనప్పటికీ తన భర్తతో కలిసి పలు వీడియో సాంగ్స్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తన ప్రేమకు సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా అతిథి రావు మాట్లాడుతూ.. గతంలో తను తన బాయ్ ఫ్రెండ్ అన్‌మోల్ తో డేటింగ్ లో ఉన్న విషయాన్ని బయటపెట్టిన ఈమె తనని కలవడం కోసం
బురుఖా వేసుకొని వెళ్లి తనని రహస్యంగా కలిసేదాన్ని అని ఈ సందర్భంగా బయటపెట్టారు.తాను బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సాధారణ వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు చేసే పనులన్నింటినీ తాను కూడా చేశానని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇలా తను ప్రేమించిన వ్యక్తిని బయట కలుసుకోవడం కోసం తన స్టార్ డమ్ ఏ మాత్రం అడ్డు రాకుండా ఉండేలా ఇలా బయటకు వెళ్ళిన ప్రతి సారి బురుఖా వేసుకొని వెళ్ళేదాన్ని అని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.ఇలా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సినీ ప్రపంచానికి దూరమైన ఈ బ్యూటీ తన భర్తతో కలిసి వీడియో సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తోంది ఇకపోతే ఈమె తెలుగులో మహేష్ బాబు సరసన అతిథి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈమె తెలుగు ఇండస్ట్రీకి దూరమైన బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది.