సీనియర్ నటుడు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గురించి అందరికీ పరిచయమే. ఇక ఈయన ఇటీవలే విడుదలైన తన కొడుకు సినిమా రాధేశ్యామ్ లో కూడా నటించాడు. ఇక ఈ సినిమా విడుదలైన సందర్భంగా కృష్ణంరాజు కొన్ని విషయాలు పంచుకున్నాడు. సినిమా చాలా బాగుందని, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని తెలిపాడు.
అంతేకాకుండా ప్రభాస్ పెళ్లి గురించి కూడా తన మనసులో మాటను బయటపెట్టాడు. ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని.. ప్రభాస్ కు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలని ఉంది అంటూ తెలిపాడు. ఇక ఇటీవలే ప్రభాస్ పెళ్లి గురించి తన పెద్దమ్మ, తన చెల్లెలు కూడా స్పందించడంతో.. ప్రస్తుతం ప్రభాస్ పెళ్లి బాగా చర్చనీయాంశంగా మారింది.