రవిబాబు దర్శకత్వం వహించిన నచ్చావులే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగు అమ్మాయి మాధవిలత. ఈ సినిమా మంచి హిట్ అవటంతో మొదటి సినిమాతోనే మాధవీ లత మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత నాని కి జోడీగా ” స్నేహితుడా ” సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత అరవింద్ 2 లో కూడా నటించి మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు కొన్ని విడుదల కాలేదు. మరికొన్ని విడుదలైన కూడా హిట్ కాలేకపోయాయి. ఇక అప్పటినుండి మాధవీ లత సినిమాలలో కనిపించలేదు.
మాధవి లత సినిమాల్లో నటించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈమె చేసే వ్యాఖ్యల వల్ల విమర్శలను కూడా ఎదుర్కొంది. అంతే కాకుండా బిజెపి పార్టీలో కీలక నాయకురాలిగా కొనసాగుతోంది. ఇటీవల గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవీ లత పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో వేరే షూటింగ్ ఉండటం వల్ల డేట్స్ కుదరక ఆ సినిమాలో చేయలేకపోయాను అంటూ చెప్పుకొచ్చింది.
అప్పటి నుండి స్పెషల్ సాంగ్స్ చేయాలని చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఐటమ్ సాంగ్ చేస్తే మినిమం 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తారు. కేవలం 5 లక్షల కోసం ఐటమ్ సాంగ్ చేయాలా? అని ఆలోచించి అలాంటి చేయకూడని నిర్ణయించుకున్నాను.. అంటూ మాధవీ లత చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె విలన్ పాత్రలో నటించాలని ఆశ పడుతున్నట్లు చెప్పుకొచ్చింది. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ చేసే పాత్రలు నాకు చాలా నచ్చుతాయి. అవకాశం వస్తే విలన్ పాత్రలలో నటిస్తాను..అంటూ మాధవీ లత చెప్పుకొచ్చింది.